దేశంలో మహిళల నిష్పత్తిలో చెప్పుకోదగ్గ మార్పులు వస్తున్నాయి. తాజా గణాంకాలు కూడా ఇవే చెపుతున్నాయి. అయితే ఇందులో గ్రామీణ ప్రాంతాలు ముందుండటం అందరిని ఆకర్షిస్తుండగా; చదువులు, సాంకేతికత అంటున్న పట్టణాలలో మాత్రం ఈ నిష్పత్తి ఇంకా అనుకున్నంతగా మెరుగుపడకపోవడం కాస్త నిరాశనే కలిగిస్తుంది. గతంలో వెయ్యి మంది పురుషులకు గాను తొమ్మిది వందలుగా ఉన్న విషయం తెలిసిందే. తాజా గణాంకాలతో ఈ సంఖ్య 1000కి గాను 1020 గా నమోదు అయ్యింది. దేశ చరిత్రలో ఇలా మహిళల సంఖ్య అధికంగా ఉండటం మొదటిసారిగా చెపుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సంస్థ నిర్వహించిన గణాంకాల ప్రకారంగా ఈ నివేదికలు వెల్లడించారు. 2015-16లో చేసిన సర్వే లో ఈ నిష్పత్తి 1000 మంది పురుషులకు గాను 991 మంది మహిళలు ఉన్నట్టు తేల్చింది.

పుట్టుక నిష్పత్తి లోను ఈ పెరుగుదల నమోదు కావడం విశేషం. గతంలో ఈ నిష్పత్తి 1000 మంది మగపిల్లలకు గాను, 919మంది ఆడబిడ్డలు గా ఉన్నది. తాజా లెక్కలప్రకారం ఈ నిష్పత్తి 1000 కి 929 గా పెరుగుదలను నమోదు చేసుకుంది. మొత్తం జనాభాలో మాత్రం ఈ నిష్పత్తి 1000 కి 1020 గా తాజా లెక్కలు చెపుతున్నాయి. అయితే ఇందులో కూడా గ్రామీణ ప్రాంతాలే ముందుండటం విశేషం. గ్రామాలలో 1000 మంది పురుషులకు గాను 1037 మంది మహిళలు ఉండగా; పట్టణాలలో మాత్రం 1000 మంది పురుషులకు గాను 985 మహిళలే ఉన్నారు. అంటే ఇంకా పట్టణాలలో ఆడబిడ్డలను స్వాగతించడం పెరగాల్సి ఉంది. ఈ స్థితి గ్రామాలలో ఉండాల్సి ఉంది, కానీ అనూహ్యంగా వాళ్ళు అర్ధం చేసుకున్నారు కానీ  పట్టణాలలో ఇంకా ఆడబిడ్డ బరువు గానే భావిస్తున్నట్టు గా ఉన్నారు. ఇప్పటికే పట్టణాలలోని వారికి దీనిపై కౌన్సెలింగ్ ఇస్తున్నప్పటికీ, ఇంకా ఆ అవసరం ఉందనేది ఈ గణాంకాలు స్పష్టం చేశాయి.

మహిళల నిష్పత్తి పెరిగిందని ఆనందించడం సరిపోదు, ఎందుకంటే ఈ మహిళల అందరిలో కేవలం 41 శాతం మంది మాత్రమే విద్యను అది కూడా ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. మిగిలిన వారిలో కూడా విద్యాబ్యాసం ముందడుగు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మిగిలిన వారిలో చాలా మంది కేవలం పది వరకే అభ్యసించి ఆపేస్తున్నారు. ఇక మహిళలలో ఇంటర్ నెట్ వాడుతున్న వారు కేవలం 33 శాతమేనట. అలాగే తమకంటూ ఒక సొంత బ్యాంకు ఖాతా ఉన్నవారు 25 శాతం పెరిగి 78.6 శాతం నమోదు చేసుకున్నారు. అందులో 43 శాతం మందికి సొంత ఆస్తి అనేది కూడా ఉంది. ఇప్పటికి పిల్లలు, మహిళలలో రక్తహీనత సమస్య ఉంది, పిల్లలలో 57.6 శాతం ఉండగా మహిళలలో 57 శాతం ఉంది. 15-49 వయసు మధ్యవాళ్ళు రక్తహీనతతో బాధపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: