గర్భిణీలు ఎంత మంచి ఆహారాన్ని తీసుకుంటే అంత మంచి ఫలితాలను చూడవచ్చు.. కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అందుకే మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మేలని వైద్యులు చెబుతున్నారు. కొన్ని రకాల పానీయాలను తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్యం ఉంది. మరి అవేంటో, ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కూరగాయల రసాలు..
కూరగాయలను నేరుగా తీసుకోవచ్చు. లేదా రసాలు తీసుకున్నా మంచిదే..ఫైబర్, విటమిన్ సి, సెలీనియం, ఐరన్, పొటాషియం తో పాటుగా ఎన్నో పొషకాలు ఉన్నాయి. టమోటాలు, బీట్ రూట్, క్యారెట్ వంటి వాటిని జ్యూస్ రూపంలో తీసుకున్నా మేలు. వీటి వల్ల శరీరానికి కావలసిన పొషకాలు నేరుగా అందుతాయి. అంతే కాదు ఈ సమయం లో వచ్చే రొగాలను కూడా నయం చేస్తుంది.
సబ్జా నీళ్ళు..
సబ్జా ఎప్పుడూ తాగినా మంచిదే.. వేడిని తగ్గిస్తాయని అంటున్నారు. కొంత మందికి కొన్ని అఫొహలు ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల నీరు పోతూందని, కానీ నిపుణులు మాత్రం అలా ఎం జరగదని చెబుతున్నారు.జీర్ణ సమస్యలకు చికిత్స చేయడానికి, ఎర్ర రక్త కణాల సంఖ్యను పెంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.కాపర్, జింక్, నియాసిన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ మరియు ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. శిశువు ఎదుగుదలకు దోహదపడతాయి.

జీలకర్ర నీళ్ళు..

గర్భం తో వున్న సమయం లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. అయితే కొన్ని రకాల అహారాలను తీసుకోవడం మంచిది.గర్భధారణ సమయంలో ఎక్కువగా తీసుకునే మూలికలలో జీలకర్ర ఒకటి. ఎందుకంటే ఇది పొత్తికడుపు నొప్పికి చికిత్స చేయడానికి, మానసిక స్థితిని పెంచడానికి మంచిది. అంతే కాదు ఉదయం లేవడానికి చురుగ్గా ఉండేలా చెస్తుంది. నార్మల్ డెలివరీకి ఇది సహాయపడతాయి. బిడ్డ మెదడు ను చురుగ్గా పని చేసెలా చెస్తుంది.. మొత్తానికి మంచి ఆరొగ్యాన్ని ఇస్తుంది.


కొన్ని రకాల స్మూతీ లను తీసుకోవడం మేలు.. నిమ్మరసం తో పాటుగా, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగా ఇవన్నీ కూడా గర్బిణీ లకు మంచి ఆరొగ్యాన్ని అందిస్తాయి. ఆహారం తో పాటు గా ఉదయం, సాయంత్రం వాక్ లేదా వ్యాయామం చేయాలనీ నిపుణులు సలహా ఇస్తున్నారు.. అలా చేయడం వల్ల సుఖ ప్రసవన జరుగుతుంది...


మరింత సమాచారం తెలుసుకోండి: