బిడ్డ పుట్టిన నాటి నుంచి 5 నెల వచ్చే వరకు తల్లి పాలు ఇవ్వడం చాలా మంచిది. ఇక డాక్టర్లు కూడా అదే సలహా ఇస్తారు. 5 వ నెల నుంచి ద్రవ ఆహారాన్ని చిన్నగా అలవాటు చేయాలి. ఈజిగా జీర్ణమయ్యే ఆహారాలను పెట్టడం మొదలు పెట్టాలి. బాగా మెత్తగా చిదిమిన అరటి పండు, బాగా ఉడకపెట్టి మెత్తగా మెదిపిన క్యారెట్ వంటివి పెట్టాలి. తినడానికి రుచిగా ఉంటాయి.అందుకే పిల్లలు ఇష్టంగా తింటారు..


రోజుకి రెండు స్పూన్స్ చొప్పున నాలుగు రోజుల పాటు ఒకే రకం ఆహారం మాత్రమే ఇవ్వాలి. ఉదాహరణకి మీరు ఈరోజు పిల్లలకు అరటి పండు బాగా మెత్తగా చేసి రెండు స్పూన్స్ పెట్టారు అనుకుంటే కొద్ది కొద్దిగా పెట్టడం పెంచాలి. ఈ అరటి పండు ను కూడా ఎప్పటికప్పుడు తాజాగా ఉండేలా చూసుకోవాలి.ఫ్రిజ్ లో పెట్టిన వాటిని అస్సలు పిల్లలకు పెట్టడం మంచిది కాదు..


ఇలా వారంలో మూడు రోజులు ఒకే ఆహారాన్ని ఇవ్వడం వల్ల కొత్త ఆహారాన్ని అలవాటు పడతారు.ఆహారం జీర్ణం కాకపోయినా లేదా ఎలర్జీలు వంటివి వచ్చిన ఈ మూడు రోజుల్లో మనకి తేడా తెలిసిపోతుంది. ఎలాంటి సమస్య రాకపోతే మరొక కొత్త ఆహారం అంటే క్యారెట్ ఉడకబెట్టి మెత్తగా మెదిపి పెట్టడం చేయాలి.రోజుకు ఒకటి మాత్రమే పెట్టాలి. ఇలా అలవాటు చాలా మంచిది.


సి విటమిన్ పిల్లలకు మంచిది అని నిమ్మ,నారింజ మొదలగునవి మాత్రం అస్సలు ఇవ్వకండి..ఇలా చేయడం వల్ల జలుబు చేస్తుంది. అంతే కాదు నెమ్ము చేరే అవకాశం కూడా ఉంది. ఇకపోతే కరకర లాడేటువంటి ఆహారం కానీ , పెరుగు కానీ మరి ఏ ఇతర ఆహారం ఇవ్వకూడదు అని గుర్తు పెట్టుకోండి.ఎందుకంటే అవి పిల్లల జీర్ణక్రియకు సెట్ అవ్వవు. పిల్లలు తినడానికి ఇష్టం చూపక పోతే మాత్రం బలవంతం గా పెట్టకుండా, కాస్త నెమ్మది గా అలవాటు చేయడానికి ప్రయత్నం చేయండి. బియ్యాన్ని దోరగా వేగనిచ్చి , నూకలుగా చేసి దాన్ని మెత్తగా ఉడకపెట్టి గుజ్జుగా అన్నం పెట్టండి. ఒకేసారి బియ్యం తో చేసిన అన్నాన్ని పెట్టకండి అసలు మంచిది కాదు..మనం ఇచ్చే ఆహారం బిడ్డ ఎదుగుదలకు దోహదపడతాయని గుర్తుంచుకోండి...


మరింత సమాచారం తెలుసుకోండి: