ఆరోగ్య‌మైన శిశువు కోసం అన్ని క‌లిసిన పౌష్టికాహారం అన‌గా ఎక్కువ పాలు, పండ్లు, ఆకుకూర‌లు, ప‌ప్పు, మాంసం, చేప‌లు వ‌గైరా వంటి తీసుకోవాలి. మొద‌టి ఆరు నెల‌లు, నెల‌కొక‌సారి, ఏడు ఎనిమిది నెల‌లలో నెల‌కు రెండు సార్లు.. తొమ్మిదోనెల‌లో వారానికి ఒక‌సారి వైద్య‌ప‌రీక్ష‌లు అవ‌స‌రం. సొంతంగా మందులు వాడ‌డం, ఎక్స్ రేలు తీయించుకోవ‌డం చేయ‌వ‌ద్దు. ఎత్తు మ‌డ‌మ‌ల చెప్పులు వాడ‌కండి, గ‌ర్భం ధ‌రించిన స్త్రీలు నిత్యం ఎల్ల‌ప్పుడు సంతోషంగా ఉండాలి.

పుట్ట‌బోయే శిశువు కూడా అదేవిధంగా ఉంటుంది. మొద‌టి మూడు నెల‌లు, చివ‌రి నెల‌లో దూర‌ప్ర‌యాణాలు, కారు స్కూట‌ర్ న‌డ‌ప‌డం వంటివి చేయ‌కూడ‌దు. రాత్రి స‌మయంలో 8-10 గంట‌లు, ప‌గ‌లు 1 గంట నిద్ర లేదా విశ్రాంతి తీసుకోవాలి. నిద్రపోయే స‌మ‌యంలో ఒక ప‌క్క‌కు తిరిగి ప‌డుకోవాలి. స్త్రీలు గ‌ర్భం దాల్చిన మూడు మాసాల త‌రువాత ప్ర‌స‌వించిన మూడు మాసముల వ‌ర‌కు యోగా విద్య‌ను అభ్య‌సించ‌రాదు.  

ఉద‌యం న‌డ‌క మాత్రం చేయ‌వ‌చ్చు. ధ‌నుర్వాతం బారి నుంచి ర‌క్ష‌ణ కోసం టెటాన‌స్ టాక్షాయిడ్ ఇంజ‌క్ష‌న్‌లు తీసుకోవాలి. ర‌క్త‌స్రావం, ఉమ్మ‌నీరు పోవ‌డం, శిశువు క‌ద‌లిక త‌గ్గిన‌ట్టు అనిపించిన‌ప్పుడు, క‌డుపు నొప్పి వ‌చ్చినా  వెంటనే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాలి. ముఖ్యంగా దారిద్య్ర‌రేఖ‌కు దిగువ ఉన్న జ‌నాభాలో స్త్రీ గ‌ర్బ‌వ‌తిగా లేని స‌మ‌యంలోనూ.. గ‌ర్భ‌వ‌తిగా ఉన్న స‌మ‌యంలోనూ ఒకే విధంగా ఆహారం తీసుకుంటున్న‌ట్టు లెక్క‌ల్లో తేలింది. బిడ్డ‌కు, త‌ల్లికీ ఇద్ద‌రికీ స‌రిప‌డా లేక ఎక్కువ ఆహారం తీసుకోవాల్సిన అవ‌స‌రం చాలానే ఉంది.

గర్భ‌వ‌తి తీసుకునే ఆహారం పుట్ట‌బోయే బ‌రువుపై ప్ర‌భావం చూపుతున్న‌ది. గ‌ర్భ‌వ‌తికి 300 కాలరీల శ‌క్తి ఎక్కువా అద‌నంగా 15 గ్రాములు కొవ్వు ప‌దార్థాలు అయిదు ఆరు నెల‌లు గ‌ర్భ‌ధార‌ణ నుంచి తీసుకోవాల్సిన అవ‌స‌రం చాలానే ఉంది.  ముఖ్యంగా గ‌ర్భ‌వతులు, బాలింత‌లు తీసుకునే ఆహారంలో అద‌న‌పు కాల్షియం ఉండాలి. శిశువు ఎముక‌లు దంతాలు రూపుదిద్దుకోవ‌డానికి, రొమ్ము పాలు పెర‌గ‌డానికి కాల్షియం చాలా ఉప‌యోగ‌ప‌డుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: