ప్రస్తుత సమాజంలో గర్భిణులకు సిజరిన్ లేకుండా డెలివరీ కావడం లేదు. గర్భిణుల స్త్రీ ఆహారంలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలను చేర్చాల్సిన అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. సి-సెక్షన్ డెలివరీ తర్వాత మహిళ జీర్ణవ్యవస్థ క్షీణిస్తుందని చెప్పుకొచ్చారు. గర్భిణులు ప్రణాళిక ప్రకారం ఆహారం తీసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు.. గర్భిణీ మహిళలు డెలివరీ తర్వాత స్త్రీ త్వరగా కోలుకోవడానికి సహాయపడే విషయాలను ఒక్కసారి చూద్దామా.

గర్భిణీ స్త్రీలు ప్రసవం తరువాత కాల్షియం లోపాన్ని అధిగమించడానికి, తన ఆహారంలో పాలు, పెరుగును చేర్చుకోవాలని చెప్పుకొచ్చారు.  అయితే గర్భిణులు రోజూ ఒక గ్లాసు తక్కువ కొవ్వు పాలు తాగాలని చెబుతున్నారు. ఇక గర్భిణీ మహిళలు మధ్యాహ్న భోజనంలో పెరుగు తీసుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు.. చలికాలంలో మఖానా, పసుపు, లవంగాలు, యాలకులు మొదలైనవి వేసి పాలు తీసుకోవచ్చునని చెబుతున్నారు.

అంతేకాదు.. సిజేరియన్ డెలివరీ తర్వాత జీర్ణవ్యవస్థ దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో చాలా సార్లు మలబద్ధకం సమస్య వస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. లోపల ఉన్న గాయాలను నయం చేయడానికి కూడా సమయం పడుతుందని అన్నారు. ఇలాంటి సమయంలో హారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. గర్భిణులు స్త్రీలు డెలివరీ తరువాత పప్పులు, బీన్స్, పచ్చిమిర్చి, స్ట్రాబెర్రీలు, చిలగడదుంపలు మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోవాలని చెప్పుకొచ్చారు.

అయితే.. సిజేరియన్ తర్వాత శరీరంలో నీటి కొరత లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెబుతున్నారు. అలాగే ప్రసవం తరువాత మహిళలో డీహైడ్రేషన్ విషయంలో మలబద్ధకం సమస్య కూడా పెరుగుతుందని అన్నారు. ఈ సమస్యను నివారించాడనికి నీరు ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాదు.. హెర్బల్ టీ, కొబ్బరి నీరు, సూప్ వంటివి తాగడం చాలా మంచిది. ఇక అల్లం-క్యారెట్ సూప్, టొమాటో సూప్, బీట్‌ రూట్ సూప్ తాగవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: