శరీరానికి పోషకాహారం చాలా కీలకం అన్న విషయం తెలిసిందే. అలాగే ఈ పోషకాహారంలో భాగమైన విటమిన్ డి కూడా ఆరోగ్యానికి చాలా అవసరం. ముఖ్యంగా మన ఇమ్మ్యూనిటికి ఇది కీలకంగా పనిచేస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు సైతం విటమిన్ డి అనేది చాలా చాలా అవసరం. అయితే విటమిన్ డి లోపం వలన కడుపు లోని బిడ్డ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. అంతే కాకుండా వయసు పెరుగుతున్న కొద్దీ చాలా మందిలో విటమిన్ డి తగ్గుతుంది తద్వారా కీళ్ల నొప్పులు, గుండె పోటు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే విటమిన్-డి ని మన శరీరంలో తగ్గకుండా చూసుకోవాలి. అయితే విటమిన్ డి మన శరీరంలో తగ్గుతుంది అన్నది కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

వ్యాధుల భారిన పడటం: శరీరంలో విటమిన్ డి తక్కువగా ఉండే స్త్రీల రోగనిరోధక శక్తి చాలా బలహీనమవుతుంది. దాంతో వారు త్వరగా జబ్బుల భారిన పడతారు. విటమిన్ డి లోపం వలన బాధపడే వారు తరచుగా  జ్వరం, జలుబు, దగ్గు వంటి వాటికి గురవుతుంటారు. ఇటువంటి వారు తమ రోగనిరోధక శక్తిని మెరుగు పరుచుకోవాలి అంటే విటమిన్ డి ని శరీరంలో పెరిగేలా చూసుకోవాలి.

బలహీనంగా ఉంటారు: విటమిన్ డి తక్కువగా ఉండే మహిళలు ఎక్కువగా అలసిపోతుంటారు. చిన్న పనికి కూడా త్వరగా నీరస పడిపోతుంటారు, ఇందుకు   ముఖ్య కారణం శరీరంలో విటమిన్ డి లోపమే అంటున్నారు వైద్యులు. అలాగే రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉన్నా కూడా శరీరంలో అలసట అనేది ఎక్కువగా ఉంటుంది.

గాయాలు త్వరగా మానవు: శరీరంలో విటమిన్ డి కనుక తగిన స్థాయిలో లేనట్లయితే గాయాలు త్వరగా మానవు.

ఎముకలు బలహీనత:  విటమిన్ డి లోపం వలన ఎముకలు , కీళ్లు నొప్పిగా ఉంటాయి. ఎముకలు క్షీణించి చాలా పెళుసుగా మారుతాయి. ఇలాంటి వారి ఎముకలు చిన్న చిన్న పనులకే విరిగిపోవడం భయంకరంగా నొప్పి ఉండటం వంటివి చూస్తుంటాం.

మరింత సమాచారం తెలుసుకోండి: