యువతలో చాలా మంది తల్లిదండ్రులు చెప్పారనో, బంధువులు చెప్పారనో ఇంటర్ లో, ఇంజనీరింగ్ లో ఇష్టం లేని బ్రాంచ్ లను, కోర్సులను ఎంచుకుంటూ ఉంటారు. ఆ తర్వాత నచ్చని సబ్జెక్టులు చదువులేక కెరీర్ ను నాశనం చేసుకుంటూ ఉంటారు. విద్యార్థులు ఎల్లప్పుడూ తమకు ఏ కోర్సులో, బ్రాంచ్ లో ఆసక్తి ఉంటే అందులో చేరడమే మంచిది. మీ తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా ఇష్టం లేని కోర్సులను ఎంచుకోవడం వల్ల భవిష్యత్తులో నష్టపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల కలిగే నష్టాలను వారికి తెలియజేస్తే కచ్చితంగా అర్థం చేసుకుంటారు. 
 
విద్యార్థులు చదువును ఎల్లప్పుడూ ఇష్టంగా చదవాలే తప్ప కష్టంగా భావించకూడదు. ఇష్టం లేని కోర్సులు ఎంచుకుంటే కెరీర్ లో ఉన్నత స్థానాలకు చేరే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇష్టం ఉన్న కోర్సులు ఎంచుకుంటే వాటిపై ఆసక్తితో పాటు అవగాహన ఉంటుంది కాబట్టి కెరీర్ లో తేలికగా విజయం సొంతమవుతుంది. అందువల్ల కెరీర్ విషయంలో ఇతరులు చెప్పిన విషయాల కంటే మనకు ఏమి ఇష్టమో దానికే ప్రాధాన్యత ఇవ్వాలి. 
 
ఒకవేళ కోర్సులపై, బ్రాంచ్ లపై సరైన అవగాహన లేకపోతే స్నేహితులు, సీనియర్ల ద్వారా వాటిపై సరైన అవగాహనను పెంపొందించుకొని ఎక్కువ అవకాశాలు ఉన్న వాటిని ఎంచుకుంటే మంచిది. విద్యార్థి జీవితంలో పదవ తరగతి తరువాత ఎంచుకునే బ్రాంచ్ లు, కోర్సులపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అందువల్ల విద్యార్థులు తప్పనిసరిగా కెరీర్ విషయంలో తమ ఇష్టాలకే ప్రాధాన్యత ఇవ్వడం ఉత్తమం. 

మరింత సమాచారం తెలుసుకోండి: