ది గ్రేట్ వాల్, మిస్టర్ డిపెండబుల్, ది వాల్... ప్రపంచ క్రికెట్ లో వీటి గురించి వినగానే క్రికెట్ అభిమానులకు ఎక్కువగా గుర్తుకు వచ్చేది రాహుల్ ద్రావిడ్. చైనాకు వాల్ ఉంటే ఇండియాకు క్రీజ్ లో వాల్ ఉండేది. అతను బరిలోకి దిగితే మొదటి రెండు ఓవర్లలో అతను అవుట్ అయితే చాలు ఆ తర్వాత అతన్ని అవుట్ చేయడం అనేది సాధ్యం కాదని భావించిన కెప్టెన్ లు ఎందరో కూడా అతనిని ఎదుర్కోవడానికి గాను ఎన్నో వ్యూహాలు సిద్దం చేసే వారు. 

 

భారత పర్యటనకు ఏదైనా దేశం వస్తుంది అంటే ముందు ద్రావిడ్ ని లక్ష్యంగా చేసుకుని అతన్ని ఎదుర్కోవడానికి వ్యూహాలు రచించే వారు. బౌలర్ల తో కెప్టెన్ ప్రత్యేకంగా సమావేశం పెట్టి అతని వీక్ నెస్ ల గురించి వివరించే వాడు. పిచ్ మీద బంతి ఎక్కడ పడితే ద్రావిడ్ ఇబ్బంది పడతాడు అనేది వీడియో లతో సహా చూపించే వాడు కెప్టెన్. అతని కోసం ప్రత్యేక వ్యూహాలు సిద్దం చేసుకుని అప్పుడు క్రీజ్ లో అడుగు పెట్టే వారు. 

 

ఓపెనింగ్ లో ఎవరైనా రానివ్వు మధ్యలో ద్రావిడ్ ఉంటే అతన్ని ఎదుర్కోవడం అందరికి సవాలే. సచిన్ ని రెచ్చగోడితే ఒత్తిడికి గురవుతాడు, లక్ష్మణ్ ని రెచ్చగొడితే ఏకాగ్రత కోల్పోతాడు... గంగూలీని రెచ్చగొడితే దూకుడుగా ఆడి వికెట్ పారేసుకుంటాడు. కాని ద్రావిడ్ అలా కాదు. ద్రావిడ్ మానసికంగా బలమైన వ్యక్తి. ఏ బౌలర్ అయినా ఎంత రన్ అప్ తీసుకున్నా, ఎంత వేగంగా బంతి విసిరినా, మాటలతో రెచ్చగొట్టినా... 

 

స్లెడ్జింగ్ చేసినా సరే ద్రావిడ్ లో ఎక్కడా కూడా ఏకాగ్రత అనేది తగ్గదు. అతను బ్యాటింగ్ పరంగానే కాదు మానసికంగా కూడా బలవంతుడు. మానసికంగా వాల్ అతను. అతన్ని ఎదుర్కోవాలి అంటే ప్రత్యర్ధి ఆట తీరులోనే కాదు ,మానసికంగా కూడా బలంగా ఉండాలి. అప్పుడే ద్రావిడ్ వికెట్ అనేది దక్కుతుంది. ప్రపంచ క్రికెట్ లో ద్రావిడ్ ని ఆదర్శంగా తీసుకుని అడుగు పెట్టిన ఆటగాళ్ళు ఎందరో ఉన్నారు. 

 

1973 జనవరి 11 న మధ్యప్రదేశ్ లోని ఇండోర్లో జన్మించిన రాహుల్ ద్రవిడ్ క్రికెట్ మీద ప్రేమతో చిన్న వయసులోనే బ్యాట్ పట్టాడు. క్రికెట్ అనేది ద్రావిడ్ కి ప్యాషన్. ద్రావిడ్ కి క్రికెట్ అనేది ఒక పిచ్చి... దీనితో అంచెలు అంచెలు గా అతను క్రికెట్ లో పైకి ఎదిగాడు. 1991లో రంజీ ట్రోఫిలో ఆరంగేట్రం చేసిన అతను అక్కడి నుంచి సరిగా అయిదేళ్ళకు అంటే 1996లో రంజీట్రోఫిలో డబుల్ సెంచరీ సాధించాడు.

 

అదే ఏడాది టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లాండు జట్టులో క్రికెట్ మక్కా లార్డ్స్‌లో మైదాన౦లో బరిలోకి దిగారు. మరుసటి తొలి టెస్ట్ సెంచరీ దక్షిణాఫ్రికాపై జొహన్నెస్‌బెర్గ్‌లో సాధించాడు. రెండేళ్లకు అంటే 1999లో ఒకే టెస్ట్ రెండు ఇన్నింగ్సులలోనే న్యూజిలాండ్ జట్టుపై సెంచరీ సాధించాడు. 2001లో వి.వి.యెస్.లక్ష్మణ్ తో కలిసి ఆస్ట్రేలియాపై ఐదో వికెట్ కి 376 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశాడు.

 

అక్కడి నుంచి అతని కెరీర్ మలుపు తిరిగిపోయింది. ద్రావిడ్ పేరు అంతర్జాతీయ క్రికెట్ లో మార్మోగిపోయింది. 2004లో రావల్పిండిలో పాకిస్తాన్ పై 270 పరుగులు చేసి టెస్ట్ క్రికెట్ లో అత్యుత్తమ స్కోర్ నమోదు చేసాడు, ద్రావిడ్ కెరీర్ లో మైలురాయి. 2005లో టెస్ట్, వన్డే క్రికెట్‌కు భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు ద్రావిడ్. 2008లో టెస్ట్ క్రికెట్‌లో 10000 పరుగుల మైలురాయిని అధిగమించి అతి తక్కువ కెరీర్ లో 10 వేల పరుగులు నమోదు చేసి రికార్డ్ నెలకొల్పాడు.  


 
టెస్ట్ క్రికెట్‌లో అతి తక్కువ ఇన్నింగ్సులలో 9000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్ గా, టెస్ట్ క్రికెట్‌లో అతి తక్కువ కెరీర్ సమయంలో 10000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మెన్ గా రికార్డ్ నెలకొల్పాడు. ఎన్నో అవార్డులు సాధించాడు ద్రావిడ్. వన్డే క్రికెట్ లో కూడా పది వేల పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా అతను రికార్డ్ నెలకొల్పాడు. ఇలా రెండు ఫార్మాట్స్ లో పది వేల పరుగులు చేసిన ఆటగాడిగా కూడా అతను రికార్డ్ నెలకొల్పాడు. 

 

కీపర్ గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి గా కూడా ద్రావిడ్ సరికొత్త రికార్డ్ లు నమోదు చేసాడు. టెస్ట్ క్రికెట్ లో అయినా వన్డే క్రికెట్ లో అయినా ఫీల్డింగ్ లో ముందు ద్రావిడ్ పేరు ప్రస్తావించే వారు. వందల క్యాచ్ లు అందుకుని అద్భుతమైన ఫీల్డింగ్ తో అతను మెప్పించాడు. ఫీల్డర్‌గా అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత క్రికెటర్ గా నిలిచాడు. 120 వన్డేల్లో డకౌట్ కాకుండా రికార్డు అతని పేరు మీదే ఉంది. ప్రస్తుతం యువ టీం ఇండియాను ద్రావిడ్ నిర్మిస్తున్నాడు. అరుదైన ఘనతలు ఎన్నో సాధించిన ద్రావిడ్ నేటి హెరాల్డ్ విజేత.

మరింత సమాచారం తెలుసుకోండి: