ప్రతీ తల్లికీ వాళ్ళ పిల్లలు అంటే ఎంతో ఇష్టం ఉంటుంది. వాళ్ళ కోసం ఆమె పస్తులుండి అయినా సరే వాళ్ళకి ఇష్టమైన కూర చేసి పెడుతూ ఉంటారు. అలానే వాళ్ళకి ఇష్టమైన దాని కోసం డబ్బులు పోగు చేసి తెచ్చి ఇవ్వడం ఎంతో మంది తల్లులకు అలవాటు.

 

IHG

 

 

అలానే ఎంత కష్టపడి అయినా సరే పిల్లల్ని మంచి దారిలో పెట్టి వాళ్ళకి మంచి జీవితాన్ని పంచాలని అను క్షణం తపిస్తారు తల్లులు. అయితే ఇప్పటి కాలంలో ఇలా ఉంటే మరి అప్పట్లో తల్లి ప్రేమ ఎలా ఉండేది? అంటే మన పురాణాల్లో కూడా తల్లికి కొడుకులపై కూతుర్లపై ప్రేమ ఉండేదా...? ఒక వేళ ఉంటే ఇప్పటి కాలం తల్లుల లాగే త్యాగం చేసారా...? పూర్తిగా చదివి తెలుసుకోండి.

 

భరతుడి తల్లి కైకేయి తన కొడుకు వృద్ధి చెంది రాజ్యానికి రాజు అవ్వాలని తనకి ఉన్న మూడు వరాల్లో ఒక వరం ఈ కొడుకుని రాజు చెయ్యాలని దశరధుడుని అడుగుతుంది. తల్లి ఎప్పుడైనా తల్లే. ఎందుకంటే తన బిడ్డ బాగా వృద్ధి చెంది ఎన్నో గెలుపొందాలని అనేక కలలు కంటారు తల్లులు. ఇలా భరతుడి కోసం కైకేయి వరం అడిగి తన కొడుకుని మహారాజు చెయ్యాలని ఆమె పంతం పట్టింది. నిజంగా కొడుకు ఎదుగుదల కోసం ఆమె ఎంతగానో శ్రమ పడింది. 

 

ధైర్యంగా ఒంటరిగా తన కొడుకులని పెంచింది సీత దేవి. భర్త తన దగ్గర లేకపోయినా అనేక సామర్ధ్యాలని, సకల విద్యలని నేర్చుకునేలా సీత లవ కుశలుని పెంచింది. అడవిలో ఒంటరిగా తన కొడుకులతో జీవించింది. ఇలా సీత దేవి ఒంటరి స్త్రీ అయినా తన కొడుకులని ఎంతో చక్కగా పెంచింది.

 

 

 

IHG's Sons Lav Luv Kush with Sita - <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=POSTERS' target='_blank' title='poster-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>poster</a> (Big Size: 19 x ...

 

యశోద కన్న తల్లి కాక పోయినా ఎంతో ప్రేమగా శ్రీ కృష్ణుడుని లాలించింది. అంత అల్లరి కృష్ణుడు అయినా సరే ఆమె అమితమైన ప్రేమ చూపించింది. కృష్ణుడుని కన్న తల్లి కంటే ఎక్కువగా ప్రేమించి పెంచింది యశోద. ఇలాంటి తల్లులు ఎందరో ఉన్నారు. నిత్యం వారి బిడ్డల కోసం త్యాగం చేస్తున్న తల్లులని తప్పక గౌరవించాలి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: