సమాజంలో సక్సెస్ అయిన వారికి ఒక విధంగా, ఫెయిల్ అయిన వారికి మరో విధంగా గుర్తింపు ఉంటుందనే విషయం తెలిసిందే. జీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో... ఏదో ఒక విషయంలో ఫెయిల్ అవుతారు. ఆ ఫెయిల్యూర్ ను ఆ వ్యక్తి ఏ విధంగా తీసుకున్నాడనే దానిని బట్టే భవిష్యత్తు ఉంటుంది. మనం ఎంత కష్టపడినా కొన్నిసార్లు వివిధ కారణాల వల్ల అనుకున్న ఫలితం రాదు. ఆ ఓటమిని పునాదిరాయిగా వాడుకుంటే మాత్రం ఆలస్యంగానైనా విజయం తప్పక సొంతమవుతుంది. 
 
జీవితంలో మనకు ఎదురయ్యే ఓటమిని... ఓటమిలా కాకుండా ఒక ఫీడ్ బ్యాక్ లా తీసుకోవాలి. అలా తీసుకున్నవారు జీవితంలో ఉన్నత స్థానాలకు తప్పకుండా ఎదుగుతారు. ఉదాహరణకు బల్బు కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ ఎడిసన్ ఆ పని సాధ్యం కాని 1000 మార్గాలను తాను కనుగొన్నానని చెబుతాడు. అయితే సక్సెస్ కోసం ప్రయత్నించే క్రమంలో గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకోవాలి. 
 
విజయం అంటే ఒక ఓటమి నుంచి మరో ఓటమికి ఉరకలు తగ్గకుండా ప్రయాణం చేయడమని గుర్తుంచుకోవాలి. జీవితంలో ఎల్లప్పుడూ ఓటమి విజయసాధనలో ఒక భాగం అని గుర్తుంచుకోవాలి. ఓటమి నేర్పే పాఠాలను నేర్చుకోవాలి. ఓటమిపాలైనా ఓటమిని అంగీకరించి తప్పొప్పులను గుర్తించి ముందడుగు వేయాలి. ఓటమిని మరోసారి ప్రయత్నించడానికి ఆరంభం అని గుర్తుంచుకోవాలి. ఓటమిని ఒక గురువులా భావించి ప్రయత్నం చేస్తే సులభంగా సక్సెస్ సొంతమవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: