నిజమే కదా! లక్ష్యాన్ని ప్రేమిస్తే 'కెరీర్'లో విజయం మీ సొంత అవుతుంది.. లేదు అంటే ఎంత కష్టపడినా సరే విజయం సొంతం చేసుకోలేరు.. లక్ష్యాన్ని ప్రేమించండి.. కెరీర్ లో విజయం సాధించండి.. కొందరు ఉంటారు.. ఏలాంటి లక్ష్యం లేదు.. చదవాలి అంటే చదవాలి.. ఉద్యోగం చెయ్యాలి అంటే చెయ్యాలి అంతే. 

 

అలా కాకుండా చిన్నప్పటి నుండే ఒక లక్ష్యం పెట్టుకొని అంటే.. డాక్టర్ కావాలని.. పోలీస్ కావాలని.. కలెక్టర్ కావాలని ఇలా ఏదో ఒకటి ఆశ పెట్టుకొని దాని కోసం ప్రయత్నం చెయ్యాలి.. లక్ష్యం కోసం కలలు కనాలి.. లక్ష్యాన్ని ప్రేమించాలి.. అప్పుడే కదా! విజయాన్ని సాధించగలరు.. లేదు అంటే ఎలా విజయం సాధిస్తారు? 

 

బడికి పోవాలి అంటే బద్ధకం.. అలాంటిది ఇంకా లక్ష్యం పెట్టుకుంటారా? అని అనుకుంటే అది మీ మూర్కత్వమే.. అంత బరువు అయితే బతకడం మానేయండి.. మంచి జీవితం కావలి అంటే లక్ష్యం పెట్టుకోవాలి..  లక్ష్యాన్ని ప్రేమించాలి.. అది చిన్నది అయినా.. పెద్దది అయినా ఇష్టపడి చెయ్యాలి.. అప్పుడే విజయం సాధిస్తారు.. 

 

మీరే ఆలోచించండి.. ఒక చెట్టును పెంచాలి అన్న కూడా ఇష్టంగా ప్రేమించాము అంటే.. దానికి ఏ సమయంలో నీళ్లు పోయాలి.. పెరుగుదలకు స్థలం సరిపోతుందా? లేదా అనేది అంత మీరు ముందే ఆలోచిస్తారు.. మొలకను చెట్టుగా.. చెట్టుని మనుగా మారుస్తారు.. లేదు అంటే ఏం చేస్తారు.. నాటడం నాటుతారు.. ఇంకా నాటిన రోజు చూడటం తప్ప మళ్లీ చూడరు.. అసలు పట్టించుకోరు.. ఇంకా ఆ చెట్టు మను ఎప్పుడు అయ్యెను.. ఆదిలోనే అంతం అవుతుంది.. అందుకే మీ లక్ష్యాన్ని ప్రేమిస్తే అందమైన జీవితం మీ సొంతం అవుతుంది.                               

మరింత సమాచారం తెలుసుకోండి: