బిగ్ బాస్ విన్నర్ కౌశల్... ఈ పేరు తెలుగు బుల్లితెర వెండితెర ప్రేక్షకులందరికీ పరిచయం అక్కర్లేని పేరు. ఓవైపు బుల్లితెరపై మరోవైపు వెండితెరపై ఇంకోవైపు వాణిజ్య ప్రకటనలతో ఎంతగానో గుర్తింపు తెచ్చుకున్నారు  కౌశల్. భారతీయ టెలివిజన్ నటుడిగా మోడల్గా సినిమా నటుడిగా,  వాణిజ్య ప్రకటన చిత్ర దర్శకుడుగా  కౌశల్ ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతోంది. అంతేకాదు ది  లుక్స్ ప్రొడక్షన్స్ అనే మోడల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ వ్యవస్థాపకుడు కౌశల్. ఇప్పటివరకు ఏకంగా భారతదేశంలో 230 వాణిజ్య ప్రకటనలను రూపొందించాడు కౌశల్. 

 


తెలుగు సీరియల్ ఎవ్వని చదనుంచు  1983లో బాలనటుడిగా  ప్రముఖ పాత్ర పోషించి మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత జెమినీ టీవీలో పేరొందిన సీరియల్ అయితే చక్రవాకంలో  ప్రధాన పాత్ర పోషించాడు. ఇక జీ తెలుగులో సూర్యవంశం సీరియల్ లో ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు. ఇక ఎన్నో సినిమాల్లో కూడా నటిస్తూ వచ్చాడు. ఎక్కువగా హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తూ వచ్చాడు కౌశల్. అయితే ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన సొంత టాలెంట్ తో సొంత కష్టంతో పైకి వచ్చి ఎంతో విజయం సాధించాడు. ఇక బిగ్ బాస్ 2 లో  కంటెస్టెంట్ గా వచ్చిన తర్వాత కౌశల్ క్రేజ్  ఎంతగానో పెరిగిపోయింది. 

 

 బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్స్ అందరూ ఒక్కటై కౌశల్ పై దాడి చేయడం.. కౌశల్ ఎంతో సహనంగా బిగ్ బాస్ హౌస్ లో అన్ని భరిస్తూ రావడం... తెలుగు ప్రేక్షకులందరికీ కౌశల్ మరింత దగ్గర చేసింది. దీంతో కౌశల్ కి అండగా నిలిచారు తెలుగు ప్రేక్షకులు. దీంతో క్రమక్రమంగా ఏకంగా బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు కౌశల్. ఇలా ప్రతి విషయంలో తనదైన గుర్తింపు సంపాదించుకుంటూ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సొంత టాలెంట్ తో ఎదిగిన కౌశల్ నేడు హెరాల్డ్ విజేతగా నిలిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: