ప్రతి మనిషి విజయం సాధించాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు. విజయం అనే పదాన్ని కొందరు ఇష్టపడితే కొందరు ఆ పదం వినగానే భయాందోళనకు గురవుతూ ఉంటారు. అయితే అందరికీ విజయం దక్కుతుందా అంటే ఎవరూ చెప్పలేరు. ప్రస్తుత కాలంలో పదుల సంఖ్యలో ఉద్యోగాలకు వేల మంది పోటీ పడుతున్నారు. అయితే అందరికీ విజయం దక్కుందా అంటే మాత్రం కొందరిని మాత్రమే విజయలక్ష్మి వరిస్తుంది. 
 
పోటీ పరీక్షల్లో కొందరు ప్రతిరొజూ 16 గంటల నుండి 18 గంటల వరకు విజయం కోసం శ్రమిస్తూ ఉంటారు. ఎవరైతే కష్టపడరో వారికి విజయం లభించదు. అలా అని విజయం సాధించడం కష్టం కాదు. పట్టుదల, కఠోర దీక్ష ఉంటే విజయం సులభంగా సొంతమవుతుంది. విజయసాధనలో అతి ముఖ్యమైనది లక్ష్యంపై ఎల్లప్పుడూ దృష్టి కేంద్రీకరించడం. ఒకటి, రెండు రోజులు ప్రయత్నించి విజయం సాధించాలంటే విజయం ఎప్పటికి సొంతం కాదు. 
 
కొన్నిసార్లు లక్ష్య సాధనలో అపజయాలు, అడ్డంకులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అంత మాత్రాన కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనో ధైర్యాన్ని పెంపొందించుకుని ఓటమి నుంచి విజయం సాధించడానికి ముందడుగులు వేయాలి. మనసులో విజయం సాధించాలనే ధృడ సంకల్పాన్ని పెంపొందించుకుని సాధ్యమైనంత మేర విజయం కొరకు కష్టపడాలి. అపజయంలో ఎదుర్కొన్న అంశాలను అవగాహన చేసుకుంటూ లక్ష్యం వైపు అడుగులు వేయాలి. 
 
చాలా మందిలో నేను సాధిస్తానా అనే భయం ఉంటుంది. గతంలోని వైఫల్యాలు, ఓటములు మనసును అనుక్షణం భయపెడుతూ ఉంటాయి. ఓటమి వెనుక దాగి ఉన్న కారణాలను అర్థం చేసుకోగలిగితే భయాన్ని సులభంగా అధిగమించవచ్చు. మనలో లేని నైపుణ్యాలు ఇతరులలో ఉంటే మనం అసూయ పడకూడదు. ఎవరికి వారు ప్రత్యేకం. మనలో ఉన్న నైపుణ్యాలు, సామర్థ్యాలను మెరుగుపరచుకుంటూ మనకు మనమే సాటి అనే విధంగా ముందుకు సాగాలి.     
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: