జీవితంలో మనం చేసే ఏ పనిలోనైనా సక్సెస్ పొందాలనే ఆలోచనతోనే ప్రయత్నం ప్రారంభమవుతుంది. కొందరు తొలి ప్రయత్నంలోనే విజయం సాధించగా మరికొందరు కొన్ని ప్రయత్నాల తరువాత విజయాన్ని సొంతం చేసుకుంటారు. కొందరు ఒకటి రెండు విజయాలు సాధించిన తరువాత వారి గురించి వారే గొప్పగా ఊహించుకుంటూ ఉంటారు. అతి విశ్వాసంతో గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. 
 
జీవితంలో ఎంత ఎదిగినా అతి విశ్వాసాన్ని మాత్రం దరి చేరనీయకూడదు. అతి విశ్వాసం వల్ల జీవితంలో దారుణమైన పరాజయాలను చవిచూడాల్సి వస్తుంది. తమపై తమకు నమ్మకం ఉండటం మంచిదే. అదే సమయంలో ఎదుటి వ్యక్తిని తక్కువగా అంచనా వేయకూడదు. ఆత్మ విశ్వాసం ఎక్కువైతే అది అతి విశ్వాసం అవుతుంది. అతి విశ్వాసం కలిగిన వారు తమ అభిప్రాయాల పట్ల అపార నమ్మకం కలిగి ఉంటారు. 
 
అతి విశ్వాసం ఉన్నవాళ్లు వాళ్ల నైపుణ్యాల పట్ల అపారమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు. అతి విశ్వాసం ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వారు ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. మనం ఎల్లప్పుడూ ఆత్మ విశ్వాసం అతి విశ్వాసంగా మారకుండా జాగ్రత్త పడాలి. అతి విశ్వాసం ఉన్నవారు కష్టమైన సమస్యల పట్ల తక్కువ శ్రద్ధ చూపుతారని పరిశోధకులు చెబుతున్నారు. 
 
లాయర్లు, డాక్టర్లు, డ్రైవర్లు, మోటారు సైక్లిస్టులు ఎక్కువగా అతి విశ్వాసంతో ఉంటారని.... అతి విశ్వాసమే వారు కెరీర్ లో ఒడిదుడుకులు ఎదుర్కోవడానికి కారణమని చెబుతున్నారు. పరిశోధకులు అతి విశ్వాసాన్ని అధిగమించాలంటే పరిమితులను కూడా గుర్తించాలని... ఇతరులతో పోల్చుకోవద్దని... నిర్మాణాత్మక విమర్శలను స్వాగతించాలని... అపజయాలను గుర్తుంచుకుంటే నైపుణ్యం, బలాలు, సామర్థ్యం తెలుసుకోవడానికి అది దోహదపడుతుందని చెబుతున్నారు. అతి విశ్వాసాన్ని వీడి పనుల్లో విజయం కోసం ప్రయత్నిస్తే సక్సెస్ సులభంగా సొంతమవుతుంది. విజయం తమదేనని ఆత్మ విశ్వాసాన్ని ప్రదర్శిస్తే జీవితంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: