జీవితంలో కొన్ని సందర్భాల్లో మనం ఎక్కువగా కష్టపడకపోయినా విజయం సొంతమవుతుంది. ఆటల్లో, చదువులో సాధించిన విజయాలు మనకు జీవితాంతం అలాగే గుర్తుండిపోతాయి. గెలుచుకున్న బహుమతులు ఆ విజయాలను గుర్తు చేస్తూ ఉంటాయి. కానీ ఇదంతా ఒకవైపు. జీవితంలో కొన్ని విషయాల్లో ఏ విధంగా సక్సెస్ పొందుతామో మరికొన్ని విషయాల్లో అదే విధంగా ఓటములను చవిచూడాల్సి వస్తుంది. 
 
విజయం సాధిస్తే ఎంత సంతోషంగా ఉంటుందో ఓటమిపాలైతే అంతే బాధగా ఉంటుంది. కానీ మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎంత కష్టపడితే దానికి అదే స్థాయిలో ప్రతిఫలం దక్కుతుంది. కష్టపడకుండా విజయం సాధించాలని అనుకుంటే వాళ్లకు ఎప్పటికీ విజయం సొంతం కాదు. మనం మనసులో ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుని అది సాధించాలని అనుకుంటే విజయం తప్పక సొంతమవుతుంది. 
 
చాలామంది ఒకటి రెండుసార్లు చేసిన ప్రయత్నాల్లో ప్రతికూల ఫలితాలు వస్తే మనకు సాధించే సత్తా లేదని ఆగిపోతూ ఉంటారు. కానీ వైఫల్యాలకు గల కారణాలను అన్వేషిస్తే ఏ పనిలోనైనా విజయం సులభంగా సొంతమవుతుంది. వైఫల్యాలకు గల కారణాలను గమనించి గతంలో చేసిన పొరపాట్లు మరలా జరగకుండా మనం జాగ్రత్త పడాలి. ఏ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామో ఆ లక్ష్యంపై ఎల్లప్పుడూ దృష్టి కేంద్రీకరించాలి. 
 
ఒకటి రెండు రోజులు కష్టపడి విజయం సొంతం కావాలంటే ఎప్పటికీ విజయం సొంతం కాదు. లక్ష్యసాధనలో ఎన్నో అడ్డంకులు, అపజయాలు ఎదుర్కోవాల్సిన అవసరం రావచ్చు. అపజయంలో ఎదుర్కొన్న అంశాలను అవగాహన చేసుకుంటూ లక్ష్యం సాధన దిశగా ముందడుగులు వేస్తే విజయం తప్పక సొంతమవుతుంది. అమ్మో ఇంత కష్టమైన పనిని నేను సాధిస్తానా అనే భయం మనసులో ఉంటే మాత్రం వారికి విజయం ఎప్పటికీ సొంతం కాదు.                            

మరింత సమాచారం తెలుసుకోండి: