మీడియా అనేది మానవాళి చరిత్రలోనే ఒక విప్లవం. పాలించే వారికి భరించే వారికి మధ్య వారధిలా పనిచేస్తూ అప్పటివరకు భరించిన వారు తమని తాము పాలించకునేందుకు అవసరమైన శక్తిని ఇచ్చింది మీడియా. అటువంటి మీడియాలోనే మరొక కొత్త అధ్యాయం డిజిటల్ మీడియా. ఒక అద్భుతం మరొక అద్భుతాన్ని కలిసినట్లు అప్పటికే చిన్న వయసులోనే ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించిన శ్రీ కోటిరెడ్డి సరిపల్లి గారి కన్ను డిజిటల్ మీడియా పై పడింది. అంతే అది ఒక మరొక పెను విప్లవంలా ఎగిసిపడింది.

 

డిజిటల్ మీడియా లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కోటిరెడ్డి గారు 'హెరాల్డ్ వసుధైక కుటుంబాన్ని' స్థాపించి అందులోని ఉద్యోగులను తన సొంత మనుషులుగా చేసుకొని ప్రేమించడం మొదలు పెట్టారు. ప్రేమతో చేసే పనులు ఎంతటి సత్ఫలితాలను ఇస్తాయో అందరికీ తెలిసిందే. అంతే…. ఇంతింతై వటుడింతై అన్నట్లు అనతికాలంలోనే ఆయన శిఖరాగ్రాలకు చేరుకుంటూ తనతోపాటు తన కుటుంబంలోని ప్రతి ఒక్కరిని తనవైపుకు క్రమంగా లాక్కుంటూ ఉన్నారు.

 

ఎదగడం అంటే మనం ఒక్కరమే కాకుండా మనతో పాటు.... మన చుట్టూ ఉన్న వారు కూడా ఎదగడమే అని చెప్పే ఆయన ఎంతోమంది ఎదుగుదలలో భాగస్వామిగా మరియు స్వార్ధ ప్రపంచంలో సేవ అనే ఒక మార్గాన్ని ఎంచుకుని అందులో అలుపెరగని బాటసారి గా పయనిస్తూ ఉన్నాడు. సరిగ్గా చూస్తే ముఖ్యంగా ఒక్క డిజిటల్ మీడియా అనే కాకుండా... తనదైన సంస్థలో అయినా కూడా ఒక విప్లవం కనిపిస్తుంది. కొత్తగా ఏదో ఒకటి చేయాలి కొత్త వారిని ఆదరించాలి తన కుటుంబం అంతా కొత్త పుంతలు తొక్కాలి అని నిరంతరం పరితపిస్తుంటారు.

 

ఆకాంక్షే అతనిని అలుపెరుగని పోరాట యోధుడిగా ప్రపంచ పటంలో నిలబెట్టింది. ఏడు వందల కోట్ల రూపాయల సంపదను ప్రపంచంలోని నలుమూలల పంచి పెట్టగల ఉదారతను ఇచ్చింది. వసుదైక కుటుంబం లో ఉన్న ఇన్నేళ్ల ప్రయాణాల్లో అతను మంచినెప్పుడూ కాదు అన్నది లేదు సమస్యలను వద్దు అన్నది లేదు తాను చేస్తున్న సేవని ఎన్నడూ చాలు అనుకున్నది లేదు. అలాంటి వ్యక్తికి ఎంత పెద్ద విప్లవం అయినా లేచి సెల్యూట్ కొట్టాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: