మన జీవితం అందంగానూ అద్భుతంగానూ మారి సరైన మార్గంలో వెళ్లాలంటే మన జీవన శైలిలో కొన్ని మంచి అలవాట్లను అలవాటు చేసుకోక తప్పదు. కొన్ని చిన్న చిన్న మార్పుల వలన మన జీవితంలో పెద్ద అద్భుతాలే జరుగుతాయి. అనుకున్న వాటిని సాధించగల శక్తి లభిస్తుంది. అలవాట్లే మన జీవిత అభివృద్ధికి మెట్లుగా మారి మన లక్ష్యానికి చేరవేస్తాయి. ఇప్పుడు మనకు ఉపయోగపడే కొన్ని అలవాట్లు గురించి తెలుసుకుందాం..

మొట్టమొదటగా రాత్రి నిద్రపోయే ముందు.... రేపు చేయాల్సిన కార్యక్రమాలు గురించి ఒక నోట్ తయారు చేసుకోవాలి. వీలైతే టైమింగ్స్ కూడా పెట్టుకోవాలి. అప్పుడే సరైన సమయానికి వాటిని పూర్తి చేయగలుగుతారు. అలా ముందుగా అనుకున్న వాటిని ప్రణాళిక ప్రకారం  ఖచ్చితంగా పూర్తి చేయాలి... అలా కాకుండా వాయిదా వేస్తూ వెళితే ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇక రెండవది ప్రతి ఒక్కరికీ ఒక లక్ష్యం ఉండనే ఉంటుంది, మరియు ఉండాలి కూడా... అలా ఆ లక్ష్యానికి కావలసిన సామర్థ్యాన్ని మనలో పెంచుకునే పనులను అలవర్చుకోవాలి.

ఉదాహరణకు మీరు  గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అన్నది మీ లక్ష్యం అయితే... అందుకు తగ్గట్లుగా ఏ విభాగంలో అయితే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలరు అన్న విషయాన్ని మేధావులు లేదా అనుభవజ్ఞులను అడిగి తెలుసుకోవాలి. లేదా ఈ విషయంలో మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకపోతే మీరే ఎంచుకోవచ్చు. ఆ తర్వాత రోజు అందుకు ప్రిపేర్ అవడానికి ప్రతిరోజు సమయాన్ని కేటాయించాలి.

ఇక మూడవది నిత్యజీవితంలో మంచి అలవాట్లను చేర్చుకోవాలి.... పొద్దున్నే లేవడం, సమాచార సేకరణ కోసం వార్తా పత్రికలు చదవడం న్యూస్ లు చూడడం లైబ్రరీలకు వెళ్ళడం వంటివి చేయాలి. కానీ ఇక్కడ మనం ఒకటి అర్ధం చేసుకోవాలి ఈ అలవాట్ల వలన వెంటనే మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులు వస్తాయి అనుకుంటే తప్పే అవుతుంది. నిదానంగా ఇది మన జీవితానికి ఒక అర్థం చూపుతాయి. కాబట్టి మనం చేసుకున్న అలవాట్లు వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని వెంటనే నిర్ణయం తీసుకుని వాటిని వదిలేయకూడదు. లేదంటే మళ్ళీ జీవితం షరా మామూలుగా యదావిధిగా ఏదో అలా సాగిపోతుంది వాటిని సరిగా ఆచరిస్తే ఫలితం తప్పక ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: