జీవితంలో ప్రతి ఒక్కరికీ గోల్స్ ను రీచవ్వాలన్న ఆశయం ఉంటుంది. ఇందుకోసం మీరు మీ గోల్ పై మాత్రమే ఫోకస్ పెట్టాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతరులతో మీరు మిమ్మల్ని పోల్చుకుని చూసుకోకూడదు. ఎప్పుడైతే మీరు ఇతరులతో మిమ్మల్ని కంపేర్ చేసుకుంటారో మీ ఫోకస్ మొత్తం మిస్సవుతుంది. తద్వారా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సమయం పట్టవచ్చు లేదా చేరుకోకపోవచ్చు. గోల్ రీచవ్వాలంటే ఖచ్చితంగా సరైన కమిట్మెంట్ అవసరం. అలాగే డెడికేషన్ కూడా చాలా ముఖ్యం. ఒక గోల్ కు మీరు పూనుకున్నారంటే ఏమి జరిగినా ఇక వెనుతిరిగి చూసుకోవాల్సినవసరం ఉండకూడదు. ఒకవేళ గోల్ ను మీరింకా గుర్తించకపోతే, ముందు ఆ పనిలో ఉండండి. మీ గోల్ ను ఎంచుకున్న తరువాత, దానిని నోట్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ ను ట్రాక్ చేసుకోండి. మీలోని నైపుణ్యాలని డెవలప్ చేసుకోవటానికి ప్రయత్నించండి. గోల్ ట్రాకింగ్ వర్క్ షీట్ తో ఇది సాధ్యమవుతుంది. మీరెక్కడనుంచి స్టార్టయ్యారు, ప్రస్తుతం మీరెక్కడ ఉన్నారు అన్న విషయంపై మీకు ఖచ్చితమైన అవగాహన ఉండాలి.
 
కొన్నిసార్లు మీ గోల్ ను మీరు చేరుకోవాలంటే, ఆ క్రమంలో మీరు చిన్న చిన్న గోల్స్ ను కొన్ని సాధించాల్సి ఉంటుంది. అవన్నీ కలిపితే మీ మెయిన్ గోల్ ను మీరు చేరుకోగలుగుతారు. కాబట్టి, మీరు మీ గోల్ ను చిన్న చిన్న గోల్స్ గా డివైడ్ చేయండి. దాంతో, మీకు గోల్ ను రీచవడం పెద్దకష్టమేమీ కాదని అనిపిస్తుంది. ఎప్పుడైతే గోల్ ను రీచవడం కష్టం కాదని మీకనిపిస్తుందో అప్పుడు మీరు ఇష్టంగా వర్క్ చేస్తారు.  ఇలా మీ లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో కొన్ని సందర్భాల్లో మీకు సపోర్ట్ కూడా అవసరం. పర్సనల్ గోల్స్ అయినంత మాత్రాన మీరు సపోర్ట్ తీసుకోకుండా వెళ్ళాలి అన్న రూల్ లేదు. ప్రణాళిక పరంగా వ్యూహాల పరంగా నిపుణుల సహాయాన్ని తీసుకోండి. మీ గోల్స్ ను మీరు ఇప్పటి వరకు చేరుకున్న ప్రోగ్రెస్ ను ...ఇలా ఇవన్నీ మీ మనసుకు దగ్గరైన వారితో పంచుకోండి. వారి ప్రోత్సాహంతో మీకు మీ గోల్ ను త్వరగా చేరువచేయడానికి హెల్ప్ చేస్తుంది. కొన్ని సార్లు గోల్ ను రీచయ్యే ప్రాసెస్ లో అలసిపోయి డీమోటివేట్ అవడం సహజం. అటువంటప్పుడు, మీకు మీరు బూస్ట్ ఇచ్చుకోవాలి.


మీరు సక్సెస్ అయిన కొన్ని సందర్భాలను గుర్తుతెచ్చుకోవాలి. ఆ సమయంలో మీ భావోద్వేగాలను నెమరువేసుకోవాలి. వెంటనే, ప్రస్తుత గోల్ ను రీచవడానికి తగినంత కాన్ఫిడెన్స్ మీకు లభిస్తుంది. గోల్స్ ను సెట్ చేసుకున్నాక రీచయ్యే ప్రాసెస్ లో మీరు కొన్ని అడుగులు వేశాక మీకు ఇది సరైన దారి కాదేమో అన్న ఆలోచన వస్తే గోల్స్ ను మార్చుకోవడానికి ఏమాత్రం ఆలోచించకండి.  ముఖ్యంగా మిమ్మల్ని మీరు ఇతరులతో కంపేర్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరి లైఫ్ జర్నీ వేరు. కంపేర్ చేసుకోవడం వలన మీ లైఫ్ లోని మాధుర్యాన్ని మీరు మిస్ చేసుకుంటారు. గోల్ ను పక్కన పెట్టేస్తారు. కొన్ని సార్లు కోల్పోయాకే కోల్పోయిన దాని విలువ తెలుస్తుంది అంటారు. కాబట్టి, మీతో మిమ్మల్నే కంపేర్ చేసుకోండి. వేరేవారితోనూ కాదు. మీ ప్రోగ్రెస్ ను అంచనా వేసుకోండి. గోల్ ను రీచయిన వారందరూ కూడా పాటించే మెయిన్ టిప్ ఇది. కాబట్టి ఈ విషయాలను తప్పక పాటించండి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: