మన చుట్టూ ఉన్న సమాజం మనకు ఎన్నో విషయాలు తెలియచేస్తుంది. ఎన్నో అంశాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా యువత సమాజం చేత ప్రేరేపించబడితారు.
మన చుట్టూ ఉన్న ఈ సమాజంలో  మంచి, చెడు రెండూ కలగలిపి ఉంటాయి . అయితే ఇవన్నీ చుట్టూ ఉన్నప్పటికీ దేన్నీ స్వీకరించాలి, దేన్నీ నేర్చుకోవాలనే నిర్ణయం మాత్రం పూర్తిగా మన మీదే ఆధారపడి ఉంటుంది. ఏది మంచి..?? ఏది చెడు..?? అని గ్రహించగల, అంచనా వేయగల వయసు మేధస్సు మనకు ఎలాగో ఉంటుంది. కానీ ఎక్కువ మంది యువత చెడు అలవాట్లకు, వ్యసనాలకు భానిసలుగా మారుతున్నారు. దీనికి కారణం చెడు అలవాట్లు అలవరచుకోడం చాలా సులభం. కానీ మంచి మార్గంలో నడవడం కాస్త కష్టం. కానీ అది చివరికి తప్పకుండా మనం కోరుకున్న గమ్యానికి చేరుస్తుంది.

అయితే చెడు మార్గంలో పయనించడం చాలా సులువు. అది మన గమ్యానికి చేర్చకపోగా ఎన్నో అవాంతరాలను , సమస్యలను తెచ్చిపెడుతుంది. కానీ చెడు మార్గం అందించే తాత్కాలిక ఆనందం కోసం దాని వైపు పరుగులు తీస్తారు. కానీ మును ముందు రాబోయే సమస్యలను గుర్తించలేరు. ఉదాహరణకు ఒక కాలేజ్ స్టూడెంట్ రోజూ క్లాసులకు వెళ్లడానికి ఫీల్ అవుతుంటాడు..అయితే ఇంతలోనే తన స్నేహితుడు వచ్చి క్లాసుకు పోవడం ఎందుకు దండగ అలా సినిమాకో, షాపింగ్ మాల్ కో వెళదాం పదా అనగానే...ఆ కుర్రాడు అతని స్నేహితుడితో కలసి వెళ్ళిపోతాడు. ఇలా సరదాలకు అలవాటుపడ్డ వాళ్ళు తరచూ అలా అలా చెడు అలవాట్లకు అలవాటుపడిపోతారు. దాని ప్రభావం వారి చదువుపై పడుతుంది.

కానీ ఆ కుర్రాడు కనుక మొదట్లోనే తన స్నేహితుడిని ఖండించి ఉంటే ఈ అలవాటు అయ్యేది కాదు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా ముందుగా ఆలోంచించగలిగితే ఎటువంటి సమస్యా ఉండదు. అదే విధంగా తల్లిదండ్రులు కూడా వారి పిల్లలపై ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఇటువంటి సమయంలో తల్లితండ్రులు పిల్లలకు చెడు  అలవాట్లు వలన భవిష్యత్తులో కలిగే నష్టాలను గురించి సానుకూలంగా వివరించగలగాలి.  అప్పుడే వారికి అర్ధమయ్యి మంచి దారిలో నడవడానికి దోహదపడతాయి. ఇటువంటి సందర్భాలు ఎదురైనప్పుడు వారికి నచ్చే రీతిలో చెబుతున్నా మంచి మార్గంలో పయనించే విధంగా వారికి నచ్చ చెప్పాలి. అప్పుడే వారి భవిష్యత్తు అందంగా మరియు ఆనంద దాయకంగా ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: