ఈ జీవన పయనంలో ప్రతి వ్యక్తి ఉన్నత స్థాయిలో ఉండాలని అందరికన్నా మిన్నగా బ్రతకాలని ఆశ పడతారు. గొప్ప వారిని చూసి వారి అదృష్టం బాగుంది, అవకాశం కలిసి వచ్చింది అందుకే గర్వించ దగ్గ స్థాయిలో ఉన్నారు అని అనుకుంటూ ఉంటారు. అందుకే అందరూ వారిని గౌరవిస్తారు. దేనికైనా రాసిపెట్టి ఉండాలి అని చాలా సింపుల్ గా అనేస్తుంటారు. కాని అది ఎంత మాత్రం వాస్తవం కాదన్నది మేధావుల వాదన. అవకాశం కోసం ఎదురు చూడకుండా ఆత్మ విశ్వాసంతో, పట్టుదలతో, కృషితో ప్రతి సందర్భాన్ని అవకాశంగా మలచుకుని ముందుకు సాగే వాడే విజయ కేతనం ఎగురవేస్తాడు. అందరితోనూ మన్ననలు పొంది అందరి కంటే మిన్నగా గుర్తింపు పొందుతాడు.

అంటుకునే శక్తి అగ్గిపుల్లకు ఉన్నప్పటికీ. దాన్ని వెలిగించుటకు ఒక చేయి కావాలి. ప్రతి రాయి లోనూ దేవుడు ఉంటాడు. కానీ ఆ రాయికి దేవుని రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. అదే విధంగా మనిషి తనను తాను నిరూపించుకుని గొప్ప స్టాయిని అందుకోవడానికి ఒక అవకాశం చాలు. కానీ ఆ అవకాశం అదృష్టం కలిసి వస్తుంది అని ఎదురుచూస్తూ కూర్చుంటే అనుకున్నది సాధించ లేము. ఆ అవకాశాన్ని మీరే అందుకోవాలి ఆశయాన్ని నెరవేర్చుకోవాలి. అదృష్టం ఉంటే మనమే గొప్ప వాళ్లం అయిపోతాంలే అంటూ మీనమేషాలు లెక్క పెట్టుకుంటూ పోతే చివరికి మిగిలేది శూన్యమే.

కాబట్టి అనుకున్నది సాధించడానికి ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉండాలి. ప్రతి మలుపును అవకాశంగా మార్చుకుంటూ మన లక్ష్యానికి నిచ్చెన వేసి కష్టపడి అధిరోహించాలి. గొప్పవాడయినా ప్రతి ఒక్కయిర్ వెనుక ఒక కనీతి గాధ ఉంటుంది. ఆ కన్నీటి గాధను అధిగమించాడు కాబట్టే ఈ రోజు సుఖ సంతోషాలను అనుభవిస్తున్నాడు.  ప్రతి ఒక్కరూ ఈ చిన్న విషయాన్ని తెలుసుకుని వ్యవహరిస్తే ఎవరూ సోమరులుగా ఉండిపోరు. అనుకున్న లక్ష్యాలను చేరుకొని గొప్పవారిగా మారిపోతారు. ఇక అదృష్టాన్ని నమ్ముకుంది చాలు..లే కష్టపడి స్వయంశక్తిని నమ్ముకో... సాధించి చూపించు.

మరింత సమాచారం తెలుసుకోండి: