అందరూ ఆర్థికంగా బాగా స్థిరపడాలని ఆశించేవారే. కానీ కాలం అందరికీ కలసి రాదు కదా. కష్టే ఫలి అంటుంటారు, అది నిజమే కానీ వాస్తవానికి శ్రమ ఒక్కటే ఉంటే సరిపోదు. ఒకవేళ అదే నిజమైతే రోజు కూలీలకన్నా కష్టపడే వారు మరెవరూ ఉండరేమో. కష్టానికి.. అవకాశం, అవకాశానికి అదృష్టం తోడైతే మన లైఫ్ స్టైల్ చిటికెలో మారిపోతుంది. అందరిలోనూ మిన్నగా మన జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించగలం. గొప్పవాడు ఎప్పుడూ గొప్ప గానే తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటారు. పేదవాడు మన జీవితం ఇంతేనని సరిపెట్టుకుంటాడు. కానీ ఈ ఇరువురి నడుమ మధ్యతరగతి వారు మాత్రం చాలా వరకు మనశ్శాంతిగా జీవించలేరు. అటు ఉన్న వారిలా జీవించలేక ఇటు లేనివారిలా సర్దుకుని బ్రతకలేక నానా అవస్థలు పడుతుంటారు.

కొందరయితే లేనిపోని ఆడంబరాలకు పోయి జీవితాలను నాశనం చేసుకుంటుంటారు. మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా బలపడాలంటే కొన్ని అంశాలను తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. అవేంటో ఇపుడు తెలుసుకుందాం...

* ఇతరులతో మిమ్మల్ని మీరు ఎపుడు పోల్చుకోవద్దు. అసలు సమస్య అక్కడే ప్రారంభమౌతుంది. ఉన్నతంగా జీవించాలనుకోడం మంచిదే. కానీ అదే ఆలోచనలతో ఉన్న జీవితాన్ని ఆస్వాదించకుండా మనశ్శాంతిని కోల్పోకూడదు.

* ఈ ఎం ఐ లో వస్తువులను కొనడం ఇపుడు అందరినీ ఆకర్షిస్తున్న అంశం...ముఖ్యంగా మధ్య తరగతి వారికి ఈ ఎం ఐ అనేది ఒక రకంగా మంచిదే. కానీ భరించలేని భారం మనకు ఎప్పుడు ముప్పే అవుతుంది. మనకు అన్ని వసతులు ఉండాలని కోరుకుంటాము. అందుకే ఒక్క సారిగా డబ్బు చెల్లించలేని కొన్నిటిని  ఈ ఎం ఐ ద్వారా కొంటుంటారు. కానీ వాటికి నెల నెల కట్టాల్సిన ఈ ఎం ఐ మన బడ్జెట్ కు మించి ఉంటే అది మన జీవితానికే పెద్ద భారంగా మారుతుంది సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మన బడ్జెట్ ను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.

*మధ్య తరగతి వారికి ఇన్స్యూరెన్స్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. టర్మ్ ఇన్స్యూరెన్స్ తప్పకుండా తీసుకోవాలి. అదే మీపై ఆధారపడి వారికి అండగా ఉంటుంది. భవిష్యత్తులో ఒక దైర్యం అనేది ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: