ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు అధికంగా ఎదురుకుంటున్న సమస్య ఇర్రెగ్యులర్ పీరియడ్స్.ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. పిరియడ్స్ సమయంలో కడుపు నొప్పి,కాళ్లు లాగటం విపరీతంగా వేధిస్తుంటాయి.దీనికి తోడు పీరియడ్స్ రెగ్యులర్ గా రాకపోతే ఆ బాధ మరీ ఎక్కువగా ఉంటుంది.ఇలా రావటానికి చాలా కారణాలు ఉన్నాయి. హార్మోన్స్ ఇమ్బ్యాలెన్స్ అవడం వల్ల,బరువు పెరగడం వల్ల,థైరాయిడ్ సమస్యా వల్ల, పిసిఓడి సమస్య వల్ల ఇంకా ఎన్నో ఇతర కారణాలు ఉన్నాయి. చాలా మంది ఎన్నో రకాల మందులను వాడుతున్నారు కాని ఫలితం మాత్రం అంతగా ఏమి కనిపించట్లేదు.దీనికి మనం ఇప్పుడు ఒక చిట్కాని చూద్దాం.ఇవి మన పూర్వికులు చెప్పిన చిట్కా.ఈ చిట్కాని ప్రయత్నంచి ఈ సమస్యను తగ్గించుకోండి.

కావాల్సిన పదార్ధాలు:
సోంపు-50 గ్రాములు,
సైందవలవణం-20 గ్రాములు,
కలకండ(పటిక బెల్లం) -25 గ్రాములు,

తయారు చేసుకునే విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టి వేడిచేయాలి.బాండీ వేడైయ్యాక దాంట్లో సోంపు వేసుకుకోని వేయించుకోవాలి. సోంపు వేగాకా మిక్సీ పట్టి మెత్తటి పొడిలా చేసుకోవాలి.ఇలా చేసుకున్న పొడిని జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక చిన్న రోలు తీసుకుని దాంట్లో సైందవలవణం వేసుకుని బాగా మెత్తగా చేసుకుని పక్కకి తీసిపెట్టుకోవాలి.తర్వాత కలకండ వేసుకుని దానిని కూడా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు సోంపు పొడి, సైందవలవణం పొడి,కలకండ పొడి ఈ మూడు పొడులను బాగా కలుపుకోవాలి.ఇలా కలిపిన పొడిని నిలువ చేసుకుని రోజుకు ఒక గ్లాస్ నీళ్లలో ఒక స్పూన్  పొడిని కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.లేదా ఒక స్పూన్ పొడిని డైరెక్ట్ గా నోట్లో వేసుకుని కొంచెం కొంచెం గా మింగుతూ అయిపొయాక ఒక గ్లాస్ నీళైనా తాగొచ్చు.ఇలా క్రమం తప్పకుండా 45 రోజులు చేస్తే ఈ సమస్య నుంచి మంచి ఫలితం లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: