నెలకి ఒకసారి బ్యూటీ పార్లర్ కి వెళ్ళడం, అలానే అప్పుడప్పుడు ఇంట్లో కూడా చిన్న చిన్న చిట్కాలు, ఇంట్లోనే ఫేషియల్స్ చేయించుకోడం లాంటివి చేస్తుంటారు. దీనికి ఎంతాగానో ఖర్చు పెడుతుంటారు. అయితే పెద్దగా  ఖర్చు లేకుండా మన వంటింట్లో దొరికే వాటితో సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. చాలా మంది నల్ల మచ్చలు, తెల్ల మచ్చలతో చాలా బాదపడుతున్నారు. దీనికి ఇప్పుడు మనం ఒక చక్కని చిట్కాని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.

కావాల్సిన పదార్ధాలు:  

   గరిక-కొద్దిగ,

     తులసాకులు- కొద్దిగ,     

మారేడు దళాలు-కొద్దిగ,

     వేపాకు- కొద్దిగ,

     పసుపు-కొద్దిగ,  

   ఆవు పంచకం-కొద్దిగ,

తయారు చేసుకునే విధానం:

ముందుగా గరికను,తులసాకులను,మారేడు దళాలను,వేపను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా కడిగిన ఈ ఆకులన్నిటిని ఒక రోట్లో వేసుకుని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. దాంట్లో కొద్దిగ పసుపు మరియు ఆవు పంచకం కొద్ది కొద్దిగ వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పేస్ట్ ని మొఖానికి పూసుకుని ఆరిపోయిన తరువాత గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని కడుగుకోవాలి. ఇలా కడిగిన తరువాత ముఖానికి ఎటువంటి సోప్ ని కాని,ఫేస్ వాష్ ని గాని ఉపయోగించకూడదు. కడిగిన తరువాత ఒక టవల్ తో ముఖాన్ని రుద్దకుండా అలా అలా అద్దుతూ ఉండాలి. ఇలా 40 రోజులు క్రమం తప్పకుండా వాడితే మంచి ఫలితం ఉంటుంది. ముఖం మీద మచ్చలు,మంగు,నల్ల మచ్చలు,తెల్ల మచ్చలు అన్నీ కూడా పోయి ముఖం ఎంతో కాంతివంతంగా ఉంటుంది.


మారేడు వల్ల ఉపయోగాలు:   మారేడు పండ్లు,కాయలు,బెరడు,వేళ్ళు,ఆకులు,పువ్వులు అన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. మారేడు వృక్షములో ప్రతి భాగము మనకు ఎంతో మేలు చేసేదే. మారేడు హిందూ దేవతలలో ఒకరైన శివ పూజలో ముఖ్యంగా ఉపయోగిస్తారు. మినరల్స్,విటమిన్స్,కాల్షియం,పాస్పరస్,ఇనుము,కెరోటిన్,విటమిన్బి,విటమిన్-సి లు ఉన్నాయి. మారేడు ఆకులని రసంగా చేసుకుని అందులో కొద్దిగ తేనె కలుపుకుని తీసుకుంటే జ్వరం తగ్గుతుంది.


పసుపు వల్ల ఉపయోగాలు: పసుపు బాహ్యంగాను, అంతరంగాను శరీర అందానికి తోడ్పడుతుంది. చర్మాన్ని శుభ్రపరచి సక్రమ రీతిలో పోషిస్తుంది. సాంప్రదాయకంగా నువ్వులనూనె, సున్నిపిండితో పసుపు కలిపి స్నానానికి వాడుతుంటారు. అలాగే బాదాంనూనె, మీగడ, తేనెను పసుపుతో కలిపి ఒంటికి రాసుకుని స్నానం చేస్తే అందంగా తయారవుతారు. ఒంటిమీద నొప్పి ఉన్నచోట, దెబ్బలు లేదా గాయాలు తగిలినచోట, వాపులవద్ద పసుపు రాస్తే చాలావరకు సంబంధిత బాధలు తగ్గుతాయి. చర్మం మీద మొటిమలు అనేక రుగ్మతలు పసుపు వాడితే తగ్గుతాయి. ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర లావణ్యాన్ని కూడా పెంచుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: