కావల్సిన పదార్థాలు: కాకరకాయలు: : 500 గ్రాములు ఉల్లిపాయలు: 2 పచ్చిమిర్చి: 2-3 బంగాళదుంప: 1చిన్నది కొత్తిమీర తరుగు: 2 టేబుల్ స్పూన్   జీలకర్ర: ½ టీ స్పూను ఇంగువ: చిటికెడు ఆమ్చూర్(ఎండిన మామాడికా పొడి): 1టీ స్పూను పసుపు: 1/4టీ స్పూను కారం: ½ టీ స్పూను ధనియాల పొడి: ½ టీ స్పూను  ఉప్పు: రుచికి సరిపడా నూనె: తగినంత తయారు చేయు విధానం: ముందుగా కాకరకాయను చక్రాల్లా కావల్సిన సైజులో ఇలా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి శుభ్రం చేసి, ఒక బౌల్లోనికి తీసుకొని మళ్ళి కొద్దిగా ఉప్పును చిలకరించి రెండు మూడు గంటలు అలా పక్కన పెట్టుకోవాలి.


ఎండలో కూడా పెట్టుకోవచ్చు. అందువల్ల అందులో ఉండే చేదు తగ్గుతుంది. షుగర్ పేషంట్స్ అయితే అలాగే డైరెక్ట్ గా వండుకోచ్చు. రెండు మూడు గంటల తర్వాత ఎండలోనుండి తీసుకొచ్చి మళ్ళీ నీళ్ళు పోసిశుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. బంగాళదుంపను మీడియం సైజ్ లోనిక కట్ చేసుకోవాలి వీటిని కొద్దిగా నూనె వేసి వేగించుకోవాలి. ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ ఉండనిచ్చి తర్వాత ఒక బౌల్లోనికి తీసి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయి(పాన్)లో నూనె వేసి కొద్దిగా జీలకర్ర వేసి, ఒక నిముషం తర్వాత చిటికెడు ఇంగువ కూడా వేసి ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకొన్న ఉల్లిపాయ ముక్కలు వేసి మీడియం మంట మీదు వేగించాలి.


ఉల్లిపాయ ముక్కలు నూనెలో వేగి, లైట్ పింక్ కలర్ వచ్చేసమయం చూసి అందులో పచ్చిమిర్చి వేసి మరోనిముషం వేగించి అందులోనే ఫ్రైడ్ పొటాటో ముక్కలు కూడా వేసి మరో నిముషం పాటు వేగించాలి.  ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకొన్న కాకరకాయ ముక్కలను కూడా వేసి తక్కువ మంటమీద ఒక పది నిముషాల పాటు నిధానంగా వేగించాలి ఇప్పుడు ఉప్పు మరియు ఇతర మసాల దినుసులన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి వేసి వేగించుకోవాలి. తర్వాత మూత పెట్టి 5-10నిముషాలు పాటు బాగా కాకరకాయ ముక్కలు మెత్తబడే వరకూ వేగించాలి. చివరగా కొత్తిమీ తరగుతో గార్నిష్ చేసి ప్లెయిన్ రైస్ కు సైడ్ డిష్ గా సర్వ్ చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: