ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఉద్యోగులు 58 సంవత్సరాలకు పదవీ విరమణ  చెందడం సర్వసాధారణమే. ఎవరైనా సరే పదవీ విరమణ చెందితే వారికి ఆయా ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు సభ ఏర్పాటు చేసి గౌరవించడం కూడా పరిపాటే. ఎలాంటి సత్కార  కార్యక్రమానికి ఆయా ఉద్యోగుల కుటుంబ సభ్యులైనా కొడుకులు, కోడళ్లు, కూతుర్లు, అల్లుళ్లు, మనువుల, మనుమరాళ్లు పాల్గొనడం మధురమైన తీపిగుర్తు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ నేటి సరఫరా మరియు మురుగులేటి పారుదల మండలి (జలమండలి) ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ 3 వ తేదీన జరిగిన వీడ్కోలు కార్యక్రమంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. జలమండలిలో ఎస్జీఏ గా విధులు నిర్వర్తించి, పదవీ విరమణ పొందిన గజ్వేల్లి ఆంజనేయులు వీడ్కోలు కార్యక్రమానికి మాత్రం అయన కొడుకులు, మనువరాళ్లతో పాటు తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు సైతం హాజరు కావడమే విశేషం.



సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామానికి చెందిన గజ్వేల్లి ఆంజనేయులు 1985లో తాత్కాలిక ప్రతిపాదికన ఎన్ఎమ్ఆర్ గా వాటర్ బోర్డు విధుల్లో చేరారు. ఆ తర్వాత 1989లో యాజమాన్యం ఇతనిని రెగ్యూలర్ చేసింది. 34 సంవత్సరాలు విధులు నిర్వహించిన ఆంజనేయులు సీనియర్ గ్రేడ్ అసిస్టెంట్ గా పదవీ విరమణ చెందారు. దీనితో జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన పదవీ విరమణ పొందిన ఉద్యోగుల వీడ్కోలు కార్యక్రమంలో ఆంజనేయులు ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఈ వేడుకలో అయన   కుటుంబ సభ్యులు భార్య- పద్మ, కొడుకులు సంతోష్ కుమార్, సంజయ్ కుమార్, మనువరాలుతో పాటు  ఆంజనేయులు తల్లిదండ్రులు గజ్వెల్లి నర్సయ్య- మణెమ్మలు సైతం హాజరయ్యారు. స్వగ్రామంలో దర్జీగా పని చేసిన నర్సయ్య( 85 సం.) వయసు మీద పడుతున్న ఇప్పటికి ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.





స్వగ్రామం నుంచి హైదరాబాద్ వచ్చిన అయన  తన  కుమారుని వద్ద శేష జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా వీడ్కోలు కార్యక్రమంలో పాల్కొన్నపీ అండ్ ఏ సీజీఎమ్ ఎం.ఎ. అబ్ధుల్ ఖాదర్ మాట్లాడుతూ..తాను ఎంతో మంది పదవి విరమణ పొందిన ఉద్యోగుల వీడ్కోలు కార్యక్రమాలను నిర్వహించానని చెప్పారు. కానీ ఆంజనేయులు సన్మాన కార్యక్రమం మాత్రం తనకు మర్చిపోలేని మధురానుభుని మిగిల్చిందని చెప్పారు. ఆంజనేయులు  పిల్లలు, మనువళ్లు హాజరయ్యారు. అంతే కాకుండా అతని తల్లిదండ్రులు కూడా రావడం చాలా అరుదైన సంఘటనఅని అన్నారు. ఈ సందర్బంగా ఆ పుణ్యదంపతులను కూడా గౌరవించుకునే అవకాశం తనకు దక్కిందన్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: