మార్కెట్‌లో ఎప్పుడూ అందుబాటులో ఉండే ఆకుకూర తోటకూర. ఇందులో పోషకాలు లెక్కలేనన్ని. తరచూ తోటకూరను ఎందుకు తినాలంటే.. బరువు తగ్గాలనుకునేవాళ్లు రెగ్యులర్‌గా తోటకూర తినడం ఉత్తమం. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది. తక్షణశక్తికి ఈ ఆకుకూర తోడ్పడుతుంది. అయితే వేపుడు కన్నా వండుకుతిన్న కూర అయితే ఉత్తమం. అప్పుడు అధిక ప్రొటీన్లు శరీరానికి అందుతాయి. 
అధిక రక్తపోటుకు అడ్డుకట్ట వేస్తుందీ కూర. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వాళ్లకు మేలు చేస్తుంది. తోటకూరలోని ‘విటమిన్‌ సి’ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. దీంతో ఒక సీజన్‌ నుంచి మరో సీజన్‌కు వాతావరణం మారినప్పుడు శరీరం తట్టుకుంటుంది. తాజా తోటకూర ఆకుల్ని మిక్సీలో వేసుకుని మెత్తగా రుబ్బుకున్నాక.. తలకు పట్టించుకుంటే మంచిది. ఇలా రెగ్యులర్‌గా చేస్తే జుట్టు రాలదు. మాడు మీద చుండ్రు తగ్గుతుంది. 


కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, పాస్పరస్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌, సెలీనియం వంటి ఖనిజాలన్నీ తోటకూరతో లభిస్తాయి. రక్తనాళాల్ని చురుగ్గా ఉంచి.. గుండెకు మేలు చేసే సోడియం, పొటాషియం వంటివీ సమకూరుతాయి. విటమిన్ల ఖని తోటకూర అని చెప్పవచ్చు. విటమిన్‌ ఎ, సి, డి, ఇ, కె, విటమిన్‌ బి12, బి6 వంటివన్నీ ఒకే కూరలో దొరకడం అరుదు. ఒక్క తోటకూర తింటే చాలు. ఇవన్నీ సమకూరుతాయి. వంద గ్రాముల తోటకూర తింటే 716 క్యాలరీలశక్తి లభిస్తుంది. కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, పీచు వంటివన్నీ దొరుకుతాయి. 


ఏ సీజన్లోనైనా చటుక్కున దొరికే ఆకుకూర.. తోరకూర. తెలుగు రాష్ట్రాలతో సహా దేశం అంతటా ఈ ఆకుకూరను విరివిగా పెంచుతారు, తింటారు. ఆకుకూరల్లో ఇది ‘రాణి’ వంటిదని అంటారు. యాంత్రిక జీవనానికి అలవాటుపడి తోటకూర రుచి, దాని ఉపయోగాలేంటో చాలామందికి తెలియడం లేదు. తాజా తోటకూరలో ఉండే పోషకాలు శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు. అందుకే తరచూ కాస్త తోటకూర తింటూ ఉండండని డాక్టర్లు చెబుతూ ఉంటారు. 
పాలు తాగితే జీర్ణం అవ్వనివారు తోటకూర తింటే జీర్ణమవుతుంది. పాల ద్వారా అందాల్సిన కాల్షియం తోటకూర అందిస్తుంది. మధుమేహ వ్యాధిగస్తులకు తోటకూర చక్కటి ఔషధం. ఇది నెమ్మదిగా జీర్ణమవుతుంది.. నెమ్మదిగా శరీరానికి శక్తిని అందిస్తుంది. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయిని స్థిమితంగా ఉంచడంలో తోటకూర దోహదపడుతుంది.
 
బీపీ ని క్రమబద్దీకరిస్తుంది. బరువు తగ్గాలనుకొనేవారికి తోటకూర చక్కటి పరిష్కారం. జుట్టు రాలకుండా ఉండటానికి, చుండ్రు తగ్గటానికి.. మిక్సీ లో తోటకూర ఆకుల్ని మెత్తగా రుబ్బుకొని తలకు రుద్దుకోవాలి. ఫలితం ఉంటుంది. అధిక ప్రోటీన్లు శరీరానికి అందాలంటే తోటకూరను వేపుడు చేసుకొని తినే బదులు వండుకొని తిన్న కూర అయితే బెటర్‌. 


మరింత సమాచారం తెలుసుకోండి: