దీపావళి అంటే ఇష్టపడని వారు ఉండరేమో.. అలాంటి ఈ పండుగను జాతీ మత బేధం లేకుండా అందరూ జరుపుకుంటారు. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ ఈ పండుగను ఇష్టంగా చేసుకుంటారు.. అది ఈ పండుగ స్పెషల్. నరక చతుర్థి నాడు అమావాస్య నాడు  ఈ పండుగను జరుపుకుంటారు. మరి ఈ పండుగ రోజు అమ్మవారికి ఇష్టమైన స్వీట్ చేసి అమ్మను ప్రసన్నం చేసుకోవాలని అనుకుంటారు అలాంటి వారు పెసర పప్పు బర్ఫీ చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం .. 

కావాలిన పదార్థాలు :
   పెసరపప్పు    :అరకిలో ,
    డ్రై ఫ్రూట్స్   : రెండు స్పూన్లు  
     చెక్కర         :అరకిలో 
      కోవా            : ఒక కప్పు 
    నెయ్యి           : మూడు స్పూన్లు 

తయారుచేసే విధానం:
  
 ముందుగా పెసరపప్పును బాగా కడిగి మూడు గంటలు నానబెట్టి కోవాలి .. తరువాత నీటిని వంపేసి పెసలను మీకేసీ పట్టి పేస్ట్ లాగా  చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఫ్యాన్ పెట్టి, అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి వేడయ్యాక అందులో పెసరపప్పు పేస్ట్ వేసి బాగా వేయించాలి . ఇక మరో ఫ్యాన్ పెట్టుకొని అందులో కోవాను వేసి వేడియ్యాక ముందుగా సిద్ధం చేసిన పెసరపప్పు మిశ్రమాన్ని ఈ కోవాలో వేసి బాగా కలపాలి. కాగా ఈ మిశ్రమం దగ్గర పడేలోపు చక్కర పాకం రెడీ చేసుకోవాలి.. ఆ పాకాన్ని పెసరపప్పు కోవా మిశ్రమంలో వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ తీసుకొని దానికి నెయ్యి రాసి అందులో వెయ్యాలి. చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకొంటే అంతే.. ఎంతో రుచికరమైన పెసరపప్పు బర్ఫీ రెడీ.. అమ్మవారికి సమర్పించి మీ ఇంట్లో సంతోషాన్ని పొందండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: