నాన్ వెజ్ ప్రియులకు
చికెన్ అంటే ఎంత ఇష్టమో తెలిసిందే. అన్నింటి కంటే తక్కువ ధరతో వచ్చేది చికెన్. అయితే ఈ
చికెన్ ఒకే విధంగా చేసుకొని తింటే ఎవరికైనా సరే
చికెన్ కూడా బోర్ కొట్టేస్తుంది. అయితే అలాంటి వారు
చికెన్ ని రకరకాలుగా చేసుకొని తినాలనుకుంటారు.. అలాంటి వారు ఈ గోంగూరా
చికెన్ చేసుకొని తినండి. అది ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.
కావలసిన పదార్ధాలు..
చికెన్ - అరకేజీ,
ఉల్లిపాయలు - రెండు,
టొమాటో - ఒకటి,
అల్లం - చిన్నముక్క,
పసుపు - అర టీస్పూన్,
గరంమసాలా - ఒక టీస్పూన్,
ఉప్పు - రుచికి సరిపడా,
మెంతులు - పావు టీస్పూన్,
కారం - తగినంత,
దనియాలు - ఒక టేబుల్‌స్పూన్,
సోంపు - ఒక టేబుల్ స్పూన్,
గొంగూర - రెండు కప్పులు
తయారీ విధానం..
ఒక పాన్ తీసుకొని మెంతులు, ధనియాలు, సోంపు, ఎండు
మిర్చి వేసి బాగా వేగించాలి. చల్లారిన తరువాత వీటిని అన్నింటిని మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్లో
నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, అల్లం,
వెల్లుల్లి, పచ్చి
మిర్చి వేసి వేగించాలి. కాసేపటి తర్వాత టొమాటో ముక్కలు వేసి బాగా వేగించాలి. టొమాటో మెత్తగా ఉడికిన తరువాత చికెన్ వేసి, గరం మసాలా, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. పావు కప్పు నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. గోంగూర ఆకులను శుభ్రంగా కడగాలి. మరొక పాన్‌లో
నూనె వేసి వెలుల్లి రెబ్బలు, గోంగూర వేసి వేగించాలి. కొంచెం ఉప్పు, గరంమసాలా వేసి కలపాలి. నాలుగైదు నిమిషాలు ఉడికించుకుంటే గోంగూర మెత్తగా, పేస్టు మాదిరిగా అవుతుంది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసి కలపాలి. చిన్నమంటపై కాసేపు ఉడికించి తర్వాత తగినంత ఉప్పు వేసి స్టౌ అఫ్ చెయ్యాలి. అంతే గుమగుమలాడే గోంగూర
చికెన్ రెడీ.