ఆదివారం వచ్చింది అంటే చాలు.. నాన్ వెజ్ తినాల్సిందే. అయితే ప్రతివారం చికెన్, మటన్ తిని తిని బోర్ కొడుతుంది. అలాంటి వారు ఒక వారం అయినా కోడి గుడ్ల కురు చేసుకొని తినాలి అనుకుంటారు. అయితే కోడి గుడ్ల కూర ఎలా చెయ్యాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. 


కావలసిన పదార్థాలు.. 


గుడ్లు - 6, 


ఉల్లిపాయలు - 2, 


టమాటాలు - 2, 



గరం మసాలా - అర టే.స్పూను, 


అల్లం, వెల్లుల్లి పేస్ట్‌ - 1 టే.స్పూను, 


పసుపు - పావు టీ స్పూను, 


ధనియాల పొడి - 1 టే.స్పూను


తయారీ విధానం.. 


గుడ్లు బాగా ఉడికించి రెండుగా కట్‌ చేయాలి. పాన్ లో నూనె పోసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు బాగా వేయించాలి. వేగాక టమాటా ముక్కలు వేసి మళ్ళి వేయించాలి. తర్వాత garlic PASTE' target='_blank' title='అల్లం వెల్లుల్లి పేస్ట్‌-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు వేయాలి. నూనె వేరు పడే వరకూ వేయించాలి. తర్వాత గరం మాసాలా, ధనియాల పొడి, ఉప్పు, వేసి బాగా కలపాలి. చివరిగా గుడ్లు కలిపి మూత ఉంచి 10 నిమిషాలు ఉడికించాలి. అంతే వేడి వేడి టేస్టీ కోడి గుడ్ల కూర రెడీ.. 


మరింత సమాచారం తెలుసుకోండి: