స్వదేశంలోనే రాజ్యాలు ఏలడానికి ఎంతో పలుకుబడి, బలం, అధికారం ఉంటే గాని ఒక పదవి సాధించలేము. అలాంటిది దేశం కాని  దేశంలో రాష్ట్రం కానీ రాష్ట్రంలో హైదరాబాద్ మహిళా చరిత్ర సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. అగ్రరాజ్యం అమెరికాలో హైదరాబాద్‌ మహిళ గజాలా హష్మీ దుమ్ము లేపింది. 


డెమోక్రటిక్‌ పార్టీ తరపున సెనేటర్‌గా వర్జీనియా రాష్ట్రంలోని టెన్త్‌ సెనేట్‌ డిస్ట్రిక్ట్‌ నుంచి ఆమె గెలుపొందారు. రిపబ్లికన్‌ అభ్యర్థి, సిటింగ్‌ సెనేటర్‌ గ్లెన్‌ స్టర్టెవాంట్‌ను గజాలా హష్మీ ఓడించడం విశేషం. ఈ విజయంతో వర్జీనియా సెనేట్‌కు ఎన్నికైన తొలి మహిళా ముస్లిం- అమెరికన్‌గా, తొలి ఇండియన్‌- అమెరికన్‌గా హష్మీ రికార్డులకెక్కారు. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఐజా ఉన్నత పాఠశాలలో ఆమె చదువుకుంది. ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్ళింది ఆమె. దశాబ్దాల క్రితమే అమెరికా వెళ్లారు. జార్జియా వర్శిటీ నుంచి బీఏ ఇంగ్లిష్‌ చదివి అనంతరం పీహెచ్‌డీ చేశారు.


 అమెరికా ఎన్నికల్లో ప్రవాస భారతీయుల విజయకేతనం కొత్త కాకున్నా.. తాజాగా నలుగురు ప్రవాస భారతీయులు వివిధ స్థాయిలకు ఎన్నికకావటం ఆసక్తికరంగా మారిందిప్పుడు. రాష్ట్ర స్థాయి ఎన్నిలకతో పాటు.. స్థానిక ఎన్నికల్లో నలుగురు ప్రవాస భారతీయులు ఎన్నికయ్యారు స్వదేశీయులు. వారు( సుహాన్ సుబ్రహ్మణ్యం, డింపుల్ అజ్మీరా, మరో రాజు, గజాలా హష్మీ) 
 
 హైదరాబాద్‌లో చదువుకునేటపుడు సహ విద్యార్థులు అమెను ముద్దుగా ‘మున్నీ’ అని పిలిచేవారు. ఆమెకు భర్త, ఇద్దరు కూతుళ్లున్నారు. కాగా, అమెరికాలోని పలు రాష్ట్రాల, స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన భారత సంతతి నేతల్లో శ్వేతసౌధ మాజీ సాంకేతిక విధాన సలహాదారు సుహాస్‌ సుబ్రహ్మణ్యం కూడా ఉన్నారు. ఆయన వర్జీనియా రాష్ట్ర ప్రతినిధుల సభకు ఎన్నికయ్యా రు. కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో పబ్లిక్‌ డిఫెండర్‌ కార్యాలయ సభ్యుడిగా మనో రాజు, ఉత్తర కరోలినా షా ర్లెట్‌ మండలి సభ్యురాలిగా డింపుల్‌ అజ్మీరా గెలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: