సహజంగా ఆడవాళ్లు శిరోజాలను ఎంతో సుకుమారంగా చూసుకుంటాం.. అలాంటిది ఓ లేడీ జుట్టుతోనే విన్యాసాలు చేస్తోంది. అదేంటి అనుకుంటున్నారా.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని జాక్లోర్‌గ్రామంకు చెందిన ఈ 37ఏళ్ల యువతి(రాణిరైక్వార్‌) ఎప్పటికైనా విమానాన్ని నా జుట్టుతో లాగుతా.. అదే నా లక్ష్యం.. అని చెబుతుంది. తన జుట్టుతో ఇంతవరకు జీపు, మినీబస్సు, ట్రక్, కంటైనర్, డబుల్‌ డెక్కర్‌ బస్సు, ట్రైన్‌ ఇంజన్‌ లాగి శభాష్‌ అనిపించుకుంది ఈ యువతి. 


రాణిరైక్వార్‌ జుట్టుతో  భారీ వాహనాలు లాగుతూ.. దేశంలో తనకంటూ ప్రత్యేకత చాటుకున్న ఆమె గచ్చిబౌలిలోని శాంతిసరోవర్‌ గ్లోబల్‌ పీస్‌ ఆడిటోరియంలో బ్రహ్మకుమారీస్‌ సంస్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. ఈ  సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆ వివరాలు... 


ఈ యువతి 1993 10 వ ఏటలో బ్రహ్మకుమారీస్‌ సంస్థలో చేరారని, ఆ సంస్థ ఇచ్చిన ప్రోత్సాహంతో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశానని, సంస్థలో  ఎన్నో నేర్చుకున్నా. ప్రస్తుతం భోపాల్‌లోని బ్రహ్మకుమారీస్‌ సంస్థలో ఉంటున్నానని అన్నారు. ఆమె 16వ ఏట కూరగాయల ట్రాలీలో పది నుంచి 25 వరకు ఇటుకలను జుట్టుతో లాగడంతో ప్రారంభించింది. ఆ తర్వాత జీపు, మినీబస్సు, ట్రక్, కంటైనర్, డబుల్‌ డెక్కర్‌ బస్సు, ట్రైన్‌ ఇంజన్‌ లాగడం లాంటివి చేసింది. ఇప్పటి వరకు 100 టన్నుల లోపు భారీ వాహనాలు జుట్టుతో లాగానని  ఈ రికార్డును ఎవరైనా బద్దలు కొడితే దాన్ని కూడా బద్దలు కొట్టడమే లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఎప్పటికైనా విమానాన్ని లాగాలనేది నా లక్ష్యంమని ఆ సమయం కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానన్నారు.


ఆమె సాధించిన రికార్డులిలా ఉన్నాయి...  2007లో కొరియాలోని ఓ చానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో డబుల్‌డెక్కర్‌ బస్‌ లాగడం. 2008లో 8 టన్నుల ట్రక్‌ను జుట్టుతో లాగడంతో లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కడం. 2012లో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు– కలర్స్‌ చానల్‌ షో ద్వారా భారీ కంటైనర్‌పై 200 మంది కూర్చొనుండగా జుట్టుతో 90 అడుగుల దూరం లాగిన రికార్డు కొట్టడం. 2019లో లండన్‌లో బ్రిటీష్‌ పార్లమెంట్‌ ద్వారా ఎనర్జిటిక్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఇండియా అవార్డు స్వీకారం... ఇవన్నీ ఎంతో సంతోషం, గుర్తింపు తెచ్చాయని తెలిపారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: