తలనొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇంట్లో చికాకు కానీ ఆఫీస్ లో వత్తిడి ఎక్కువ అయినా.. సరైన సమయానికి తిండి తినకపోయినా.. ఇలా ఏదో ఒక చికాకుతో తలనొప్పి వస్తుంటుంది. అయితే తాజా పరిశోధనల్లో హ్యాండ్ బ్యాగ్ ఎక్కువగా ఉపయోగించిన తలనొప్పి వస్తుంది అని అంటున్నారు పరిశోధకులు. అయితే హ్యాండ్ బ్యాగ్ ఉపయోగిస్తే తలనొప్పి ఎందుకు వస్తుంది అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.  


హ్యాండ్ బ్యాగ్ వల్ల తలనొప్పి అంటే కొట్టిపడేస్తారు.. కానీ బరువుగా ఉన్న హ్యాండ్ బ్యాగ్ ని గంటలకొద్దీ ఒకే చేతికి వేసుకుంటే ముందు చేతులకు, తర్వాత భుజాలకు.. ఆతర్వాత మెడనొప్పి ఇలా వస్తాయి. ఆ నొప్పులు కాస్తా తల నొప్పికి దారితీస్తాయి అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎక్కువ బరువు ఉండటం వల్ల ఒత్తిడికి గురై ఈ తల నొప్పి వస్తుంది తాజా పరిశోధనలు చెప్తున్నాయి. 


అయితే ఈ పరిశోధనల్లో తేలిన ప్రకారం బ్యాగ్ లో తక్కువ బరువు ఉండకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరమైన వస్తువులు మాత్రమే బ్యాగ్ లో ఉండాలని అనవసరమైనవి బ్యాగ్ నుంచి తీసేయాలి అని చెప్తున్నారు. అంతేకాదు ఒకే సైడ్ బ్యాగ్ వేసుకోకుండా.. మద్యమద్యలో బ్యాగ్ మారుస్తూ ఉండాలి.. అప్పుడే ఆ హ్యాండ్ బ్యాగ్ వల్ల పెద్ద సమస్య ఉండదు. చూసారుగా హ్యాండ్ బ్యాగ్ వల్ల ఎన్ని సమస్యలు అనేది.. అందుకే హ్యాండ్ బ్యాగ్ బదులుగా బ్యాక్ ప్యాక్ వాడటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.   



మరింత సమాచారం తెలుసుకోండి: