కావాల్సిన పదార్థాలు:
క్యారెట్‌- అరకేజీ
మామిడి కాయ- ఒక‌టి
మినప్పప్పు- అర టీ స్పూన్‌
కరివేపాకు- తాలింపుకు సరిపడా


పల్లీలు- గుప్పెడు
పచ్చికొబ్బరి- అర క‌ప్పు
ఉప్పు- రుచికి తగినంత
పసుపు- చిటికెడు
పచ్చిమిర్చి- ఆరు


నూనె- రెండు టీ స్పూన్లు 
ఎండుమిర్చి- రెండు
ఆవాలు- అర టీ స్పూన్‌
శనగపప్పు- అర టీ స్పూన్‌


తయారీ విధానం: 
ముందుగా క్యారెట్ల‌ను శుభ్రం చేసుకోవాలి. త‌ర్వాత క్యారెట్లు, కొబ్బరి, మామిడికాయలతో పాటుగా తురుముకోవాలి. ఇప్పుడు పాన్‌లో నూనె వేసి.. వేడి అయ్యాక మిన‌ప్ప‌ప్పు, ఆవాలు, శ‌న‌గ‌ప‌ప్పు ఇలా తాలింపు దినుసులు ఒక్కొక్క‌టిగా వేసి చివ‌రిలో పల్లీలు, కరివేపాకు వేసి వేగించాలి. ఆ తర్వాత ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి తరుగు వేసి దోరగా వేగించాలి. ఇప్పుడు క్యారెట్‌, కొబ్బరి, మామిడి తురుము కలిపి రెండు నిమిషాలుంచి దించేయాలి. 


అంతే టేస్టీ టేస్టీ క్యారెట్‌ తరుము పచ్చడి రెడీ. ఈ ప‌చ్చ‌డిని అన్నంతో లేదా దోశ‌ల‌తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అయితే క్యారెట్‌, మామిడి కాయ మ‌రియు కొబ్బ‌రి.. ఈ మూడు ఆరోగ్యానికి చాలా మంచిది. సో.. ఈ మూడిటితో ఇలా చ‌ట్నీ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి. 


మరింత సమాచారం తెలుసుకోండి: