దిశ ఘటన యావత్ దేశాన్ని ద్రిగ్భ్రాంతికి గురి చేసింది. యావత్ భారత దేశం తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరు వెంటనే ఈ మృగాలను చంపేయాలని డిమాండ్ చేశారు. సరిగ్గా ఇప్పుడు వాళ్ళను ప్రభుత్వం ఎన్ కౌంటర్ చేసింది. గతంలో 2008 లో వరంగల్ యాసిడ్ ఘటన జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాగే నిందితుడిని కాల్చి చంపేశారు. అప్పుడు .. ఇప్పుడు ఎస్పీ సజ్జనార్. దీనితో ఎన్ కౌంటర్ ప్లాన్ ప్రకారమే జరిగిందని చెప్పొచ్చు. ఏది ఏమైనా ఈ నిందితులను ఎన్ కౌంటర్ చేయడంతో ప్రజలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

 

దేశ వ్యాప్తంగా దిశ ఘటన సంచలనం రేపిన సంగతీ తెల్సిందే. ఈ ఘటన పై దేశ ప్రజలు భగ్గుమన్నారు. సినీ ప్రముఖులు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దేశ పార్లమెంట్ ఈ ఘటన పై భగ్గుమన్నది. ఈ ఘటనకు వ్యతిరేకంగా యావత్ భారతావని గొంతెత్తుతోంది. దిశ దారుణ హ్యతకు నిరసనగా ప్రజలంతా రోడ్లపైకి ఎక్కారు. ఈ ఘటనకు కారణమైన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి లోకం, మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఇలా సమాజం మొత్తం ఒక్కతాటిపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తూ దోషులను వెంటనే శిక్షించాలని కోరుకున్నారు. ఇప్పుడు సరిగ్గా అదే జరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: