కావాల్సిన ప‌దార్థాలు:
పాలు- పావు కప్పు
బేకింగ్‌ సోడా- చిటికెడు
బ్రౌన్‌ సుగర్‌ పౌడర్‌- ఐడు టేబుల్‌ స్పూన్లు

 

బిస్కట్‌ పౌడర్‌- ఆరు టేబుల్‌ స్పూన్లు
ఏలకుల పొడి- చిటికెడు
అరటిపండ్లు- ఐదు
చాక్లెట్‌ క్రీమ్‌- కొద్దిగా

 

తయారీ విధానం:
ముందుగా అర‌టిపండ్ల‌ను ఇరువైపులా కొద్ది కొద్దిగా తొల‌గించి నిలువుగా రెండు ముక్క‌లు చేసుకోవాలి. త‌ర్వాత‌ ఒక బౌల్‌లో బ్రౌన్‌ సుగర్‌ పౌడర్, పాలు, బేకింగ్‌ సోడా, ఏలకుల పొడి, బిస్కట్‌ పౌడర్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అరటి పండు ముక్కలకు ఈ మిశ్రమాన్ని బాగా పట్టించి ఒక్కో వేఫర్‌లో ఒక్కో అరటిపండు ముక్కను పెట్టుకుని, రోల్స్‌లా చుట్టుకుని, నూనెలో డీప్‌ఫ్రై చేసుకోవాలి. 

 

చివ‌రిగా చాక్లెట్‌ క్రీమ్‌ లేదా కలిపి వీటిని సర్వ్‌ చేసుకుంటే  స‌రిపోతుంది. అంతే య‌మ్మీ య‌మ్మీ బ‌నానా స్ప్రింగ్ రోల్స్ రెడీ. వీటిని చిన్న పిల్ల‌లైనా.. పెద్ద‌వారికైనా పెడితే ఎంతో ఇష్టంగా తింటారు.   అందరికీ అందుబాటులో ఉండే పండ్లలో అరటిపండు ముఖ్యమైనది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: