కావాల్సిన ప‌దార్థాలు:
రొయ్యలు- అరకేజీ
అల్లం ముక్క‌- చిన్న‌ది
పచ్చిమిర్చి- రెండు
వెల్లుల్లి తరుగులు- ఒక‌ టీ స్పూన్‌

 

రెడ్‌ ఫుడ్‌ కలర్‌- చిటికెడు
నూనె- ఒక‌ టేబుల్‌ స్పూన్‌
ఉల్లి తరుగు- అర కప్పు

 

సోయాసాస్‌- రెండు టీ స్పూన్లు
కార్న్‌ఫ్లోర్‌- అర టీ స్పూన్‌
కారం- రెండు టీ స్పూన్లు
ఉల్లి కాడ‌లు- ఒక క‌ప్పు

 

ఉప్పు- రుచికి తగినంత
పంచదార- అర టీ స్పూన్‌
వెనిగర్‌- ఒక‌ టీ స్పూన్‌

 

తయారీ విధానం: 
ముందుగా రొయ్యల్ని శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కార్న్‌ఫ్లోర్‌, ఉప్పు, కారం, సోయా సాస్‌, పంచదార, వెనిగర్‌, పుడ్‌ కలర్‌ పట్టించి గంటపాటు పక్కనుంచాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి ఉల్లితరుగు దోరగా వేగించుకోవాలి.

 

ఇప్పుడు ఉల్లి వేగాక అందులో పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి తరుగు కూడా వేగించి రొయ్యల మిశ్రమాన్ని వేయాలి. రొయ్యలు వేగాక ఉల్లికాడ తరుగు చల్లి రెండు నిమిషాల తర్వాత దించేయాలి. అంతే టేస్టీ టేస్టీ చిల్లీ ప్రాన్స్ రెడీ.. దీన్ని వేడి వేడి రైస్‌తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: