కావాల్సిన ప‌దార్థాలు:
చేపలు- రెండు
నిమ్మరసం- కొద్దిగా
పచ్చిమిర్చి- నాలుగు
కొబ్బరి తురుము- రెండు టీస్పూన్లు

 

అరిటాకులు- చిన్న‌వి రెండు
కొత్తిమీర- కొద్దిగా
వెల్లుల్లి- నాలుగు రెబ్బలు
 జీలకర్ర- ఒకటీస్పూను

 

తయారీ విధానం:
ముందుగా చేపలను శుభ్రం చేసి కొంచెం పెద్దముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిపై నిమ్మరసం, ఉప్పు చల్లి పావుగంటసేపు నాననివ్వాలి. ఆ త‌ర్వాత కొబ్బరి తురుము, పచ్చిమిర్చి త‌రుయు, కొత్తిమీర, వెల్లుల్లి, జీలకర్ర కలిపి పేస్టు చేసుకోవాలి. ఒక్కో చేప ముక్కను ఒక్కో అరిటాకులో పెట్టి మసాలా పేస్టును ముక్కలకు రెండుపక్కలా పట్టించాలి.

 

ఇప్పుడు ఆ అరిటాకులను మడిచి ఊడిపోకుండా దారంతో కట్టాలి. వాటిని ఆవిరిలో ఏడు నిమిషాలపాటు ఉడికిస్తే నోరూరించే అరిటాకు ఫిష్‌ రెడీ అయిపోయిన‌ట్టే. దీన్ని వేడి వేడి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి. అరిటాకు ఆరోగ్యానికి మంచిద‌న్న విష‌యం అంద‌రికీ తెలుసు. ఇక ఫిష్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అయితే ఇలా అరిటాకు ఫిష్‌ చేసుకొని తింటే చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: