కావాల్సిన ప‌దార్థాలు:
బ్రెడ్ స్లైసు- ఒకటి
కోడిగుడ్డు- ఒకటి

 

ఉప్పు- రుచికి స‌రిప‌డా
కారం- తగినంత
నూనె- ఒక టీ స్పూన్‌

 

త‌యారీ విధానం:
ముందుగా బ్రెడ్ స్లైసును తీసుకొని పది సెకన్లు పెనం మీద పెట్టి వేడి చెసి ప‌క్క‌న పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ పై కొద్దిగా నూనె రాయండి. త‌ర్వాత కోడిగుడ్డు పగుల కొట్టి వేసి.. దానిపై ఉప్పు కారం జల్లండి. అది కొద్దిగా కాలాక బ్రెడ్ వేసి అదమండి. దాన్ని మరో పావుకు కొద్దిగా నూనె వేయండి. మరి కొంచెం కాలాక మరో వైపుకి తిప్పి కాల్చండి. బ్రెడ్ కొద్దిగా గొధుమ రంగులోకి రాగనె స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంతే వేడి వేడి బ్రెడ్ ఆంలెట్ రెడీ. 

 

సహజంగా ప్రతి ఒక్కరూ బిజీ లైఫ్‌తో మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ తినడానికి ఇష్టపడరు. మ‌రికొంద‌రు సమయం లేకపోవడంతో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్‌ తినకుండా హడావిడిగా వెళ్లిపోతుంటారు. అయితే అలాంటి ఇలాంటి సింపుల్ అండ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని తింటే చాలా మంచిది. అదే విధంగా, ఇది తిఫిన్ కి, లంచ్ కి, సాయంత్రం స్నాక్ కి, రాత్రి లైట్ గా తినాలి అనుకునేవారికి మంచి ఆప్షన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: