ఆస్ట్రేలియాలో కార్చిచ్చు మొదలై ఉగ్రరూపం దాల్చింది. ఈ మంటల్లో ఎన్నో జంతువులు, పశు పక్షాదులు అగ్నికి అహుతి అయ్యాయి. రోజురోజుకీ మంటలు తీవ్రస్థాయిలో విస్తరిస్తున్నాయి. దట్టమైన పొగ వ్యాపించడంతో పాటు మంటల తీవ్రత ఎక్కువడంతో 5 మిలియన్ల హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న అడవి అంతా అగ్నిలో దగ్ధం కాగా, 500కు పైగా పక్షులు, జంతువులన్నీ అగ్నీకి ఆహుతి అయ్యాయి. ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కారణంగా ఎంతోమంది  నిరాశ్రయులయ్యారు. 24 మంది వరకు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇలాంటి దుర్భర పరిస్థితిని చూసి అమెరికాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ కెయెలన్ వార్డ్ (20) హృదయం చలించిపోయింది. 


కాగా., తనవంతు సహాయంగా కార్చిచ్చు బాధితులకు ఎలాగైనా సాయం చేయాలని గట్టిగా నిర్ణయించుకుంది ఈ యువతి. తన నగ్న ఫొటోలను అమ్మకానికి పెట్టింది. ట్విట్టర్ అకౌంట్ లో నగ్నంగా దిగిన ఫొటోలను పోస్టు చేసి విరాళాలు సేకరించింది. రెండు రోజుల్లోనే ఆమె న్యూడ్ ఫొటోలపై 700వేల డాలర్లు (రూ.5 కోట్లు) విరాళంగా సేకరించింది. తన ట్విట్టర్ యూజర్ నేమ్ 'The naked philanthropist' పేరుతో ఉన్న అకౌంట్లో జనవరి 4న విరాళాల సేకరణపై ప్రకటన చేసింది.


ఆస్ట్రేలియాలో కార్చిచ్చును ప్రస్తావిస్తూ విరాళాలు సేకరిస్తున్నట్టు సోషల్ మీడియలో వెల్లడించింది. ప్రతిఒక్కరికి తన న్యూడ్ ఫొటోలను పంపుతూ కనీసం 10 డాలర్లు విరాళంగా ఇవ్వాలని కోరింది. 'కార్చిచ్చు బాధితులను ఆదుకునేందుకు నేను విరాళాలు సేకరిస్తున్నాను. 10 డాలర్లు డొనేట్ చేస్తే.. ఒక న్యూడ్ ఫొటో పంపుతాను. డొనేట్ చేసినవారంతా నాకు తప్పక తెలియజేయండి' అంటూ ట్వీట్ చేసింది. 

 

డబ్బుల కోసం విరాళాల పేరుతో తన న్యూడ్ ఫొటోలను అమ్మకానికి పెట్టిందని విమర్శిస్తున్నారు. తనపై వస్తున్న విమర్శలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వార్డ్.. 'ప్రతిఒక్కరికి నేను చెప్పేది ఒకటే.. డబ్బుల సంపాదన కోసం నేను ఇలా చేయలేదు. విరాళంగా పంపినవారి సొమ్ము అంతా నేరుగా చారిటీలకు పంపడం జరిగింది. డొనేట్ చేసిన ప్రతిఒక్కరిని డొనేట్ చేసినట్టుగా నాకు చెప్పమని కూడా కోరాను' అంటూ ట్వీట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: