మష్రూమ్స్‌.. శాకాహారులకు ఇదే మాంసం. ఎందుకంటే ఈ మష్రూమ్స్‌ మాంసం కంటే రుచిగా ఉంటాయి. అందుకే ఈ మష్రూమ్స్‌ ను ఎన్నో రకాలుగా వండుకొని తింటుంటారు. మష్రూమ్స్‌ బిర్యానీ అని, ఫ్రై అని, కూరా అని, ఫ్రైడ్ రైస్ అని ఇలా ఎన్నో రకాల మష్రూమ్స్‌ రెసిపీని చేసుకొని తింటుంటారు. అయితే  ఇప్పుడు జీడిపప్పుతో మష్రూమ్స్‌ ని చేసుకొని తినండి.. సండే స్పెషల్ గా ఇంట్లో చేసి పెట్టండి.. 

 

కావలసిన పదార్థాలు... 

 

మష్రూమ్‌ ముక్కలు - 300 గ్రాములు, 

 

ఉల్లిపాయలు -2, 

 

పచ్చిమిర్చి -4, 

 

అల్లం పేస్టు -1 టీ స్పూను, 

 

టమోటా గుజ్జు - 2 కప్పులు, 

 

జీడిపప్పు పేస్టు - పావు కప్పు, 

 

ధనియాల పొడి - 1 టీ స్పూను, 

 

దాల్చినచెక్క -2 అంగుళాలు, 

 

లవంగాలు -3, 

 

యాలకులు - 3, 

 

ఉప్పు - రుచికి తగినంత, 

 

పసుపు - పావు టీ స్పూను, 

 

నూనె - 1 టేబుల్‌ స్పూను.

 

తయారీ విధానం... 

 

దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేగించి పొడి చేసి పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి ఉల్లి, పచ్చిమిర్చి తరుగు, అల్లం పేస్టు వేగించాక టమోటా గుజ్జు వేయాలి. తర్వాత కారం, పసుపు, మసాలా పొడి, జీడిపప్పు గుజ్జు కలపాలి. ఐదు నిమిషాల తర్వాత మష్రూమ్‌ ముక్కలు, ఉప్పు వేసి సన్నని మంటపై 15 నిమిషాలు ఉంచాలి. ఈ కూర చపాతీ లేదా పూరీలలోకి ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ రెసిపీని చేసుకొని తినండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: