చికెన్ బాల్స్.. చికెన్ రెసిపీస్.. చికెన్ అంటే చాలు.. ఎలా అయినా సరే ఎలా చేసుకొని అయినా సరే చేసేస్తారు.. ఎందుకంటే.. చికెన్ ప్రేమికులు అంతమంది ఉంటారు మరి.. చికెన్ అంటే అంత ఇష్టం ఉంటుంది మరి. అయితే అలాంటి ఈ చికెన్ తో చికెన్ బాల్స్ ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.. చికెన్ బాల్స్ ను ఇంట్లోనే చేసుకొని తినండి.  

 

కావలసిన పదార్థాలు... 

 

బోన్‌లెస్‌ చికెన్‌ - 200 గ్రా., 

 

అల్లం ముక్కలు - 1 టీ స్పూను, 

 

ఉల్లిపాయ ముక్కలు - 3 టీ స్పూన్లు, 

 

మెంతి ఆకు - 1 టేబుల్‌ స్పూను, 

 

తరిగిన పచ్చిమిర్చి - 1 టీ స్పూను, 

 

తరిగిన కొత్తిమీర -2 టీ స్పూన్లు, 

 

తరిగిన వెల్లులి- 1 టీ స్పూను, 

 

నలగ్గొట్టిన లవంగాలు - రెండు, 

 

కారం, గరమ్‌ మసాలా, ఉప్పు - రుచికి తగినంత.

 

తయారుచేసే విధానం... 

 

చికెన్‌ను శుభ్రంగా కడిగి నీరులేకుండా మిక్సీలో వేసుకుని కైమాలా గ్రైండు చేసుకోవాలి. దాన్లో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసుకుని బాగా కలపాలి. ఈ ముద్దను చిన్న చిన్న ఉండల్లా తయారుచేసి ఆవిరిపైన బాగా ఉడికించాలి. ఈ చికెన్‌ బాల్స్‌ని వేడివేడిగా సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: