సమాజం ఎటు పోతుందో ఆర్థం కానీ పరిస్థితి. ఎవ‌రిని న‌మ్మాలో.. ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో తెలియ‌ని ఈ లోకంలో బిక్కుబిక్కుమంటూ బ్ర‌తుకున్న వారు ఎంద‌రో. మృగాలు అంటే అడవిలో ఉండేవి ఇప్పుడు మనముందు మనుషుల రూపంలో తిరుగుతున్నారు అన‌డంలో ఏ మాత్రం సందేహం లేదు. మహిళలు, చిన్న పిల్లలపై జరగుతున్న అత్యాచారాలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నా.. మరోవైపు మాత్రం అవేమి పట్టించుకోని కొంతమంది మృగాళ్లు తమపని తాము చేసుకుపోతున్నారు. దేశంలో ఎక్కడ చూసినా మానవ మృగాల బారిన పడిన చిన్నారుల రోదనలు వినిపిస్తూనే ఉన్నాయి. 

 

ఇక తాజాగా తాను ప్రేమించిన యువతి పై స్నేహితులతో కలిసి లైంగిక దాడికి యత్నించాడు ఓ యువకుడు. తమిళనాడులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. వివ‌రాల్లోకి వెళ్తే.. వేలూరులోని ఓ కాలేజీలో చదువుతున్న విద్యార్థిని క్లాస్‌మేట్‌ని ప్రేమిస్తోంది. ఈ క్ర‌మంలోనే వీరిద్ద‌రు అప్పుడప్పుడు బయటకు వెళ్లి షికార్లు కొట్టేవారు. అయితే నాలుగు రోజుల క్రితం ఆ యువ‌కుడు ఆమె అమ్రితి పార్కుకు తీసుకెళ్లాడు. అక్క‌డ నుంచి సమీపంలోని అడవుల్లోకి తీసుకెళ్లాడు. ఇక అప్ప‌టికే ప‌థ‌కం ప్ర‌కారం ఆ యువ‌కుడి స్నేహితులు ముగ్గురు అక్క‌డికి చేరుకున్నారు. యువతిని అక్కడకు తీసుకు రాగానే వీరంతా కలిసి ఆమెపై అత్యాచారయత్నం చేసారు. 

 

ఈ క్ర‌మంలోనే యువ‌తి కేక‌ల్ వేడంలో అవి విన్న ఓ వృద్ధుడు అక్కడికి పరుగు పరుగున వచ్చి వారిని అడ్డుకున్నారు. అయితే యువ‌కులు కాస్త ఆ వృద్ధుడుపై తిర‌గ‌ప‌డ్డారు. కాని, వృద్ధుడు మాత్రం చాలా తెలివిగా ఈల వేయడంతో సమీపంలో చెట్లు నరికే కొందరు వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. దీంతో నిందితులు పరారయ్యారు. అయితే వారంతా కలిసి ఓ నిందితుడిని పట్టుకుని నెత్తిమీద కట్టెల మోపు పెట్టి సమీప గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ స్థానికులందరూ కలిసి అతడికి దేహశుద్ధి చేసి వ‌దిలిపెట్టారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఆ వృద్ధుడుని మ‌రియు స్థానికుల‌ను అభినందించి.. యువతి నుండి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: