గుడ్ల కూర మనం మామూలుగానే తింటాం. అయితే గుడ్లు పులుసు మాత్రం చాల అరుదుగా తింటుంటాం. అసలు కొంతమంది అయితే గుడ్లు పప్పు పులుసు తినే ఉండరు. ఇంకా అలాంటి వాళ్ళుకు గుడ్లు పప్పు పులుసు చెయ్యడం ఏమి తెలిసి ఉంటుంది. కాబట్టి ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. అద్భుత రుచిని పొందండి. 

 

కావలసిన పదార్థాలు... 

 

గుడ్లు - 5, ఉల్లిపాయలు - 5, 

 

కందిపప్పు- 200గ్రా., చింతపండు - 100గ్రా., 

 

ధనియాలపొడి - 2 టీ స్పూన్లు, 

 

సాంబారుకారం - 2 టీ స్పూన్లు, 

 

మిరియాలపొడి - అర టీ స్పూను, 

 

ఉప్పు - తగినంత, 

 

తాలింపు దినుసులు - 1 టీ స్పూను, 

 

కరివేపాకు - 4 రెబ్బలు, 

 

నూనె - 5 టీ స్పూన్లు, 

 

కొత్తిమీర - 1 కట్ట.

 

తయారుచేసే విధానం... 

 

ముందుగా గుడ్లను ఉడికించి పెంకులు తీయాలి. కందిపప్పుని వేగించి, ఉడికించి, రుబ్బాలి. చింతపండు రసాన్ని తయారుచేసుకోవాలి. ఇప్పుడు పాత్రని స్టౌవ్‌మీద పెట్టి తాలింపు దినుసులు, కరివేపాకు వేగనిచ్చి పప్పు, చింతపండు రసం, కారం, ధనియాలపొడి, మిరియాలపొడి, ఉప్పుతో పాటు ఉల్లిపాయలు వేసి, తగినంత నీరు జతచేసి మరిగించాలి. ఉల్లిగడ్డలు ఉడికిన తర్వాత గుడ్లు వేసి మరో రెండు నిమిషాలు మరిగించి దించేముందు కొత్తిమీర చల్లాలి. అంతే పప్పు ఎగ్ పులుసు రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: