రోజు రోజుకి తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. మహిళల రక్షణ కోసం ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా.. అవి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఓవైపు కఠిన చట్టాలు రూపొందిస్తున్నామని అనుకుంటున్న తరుణంలోనే మరోవైపు మహిళలపై అఘాయిత్యాలు విచ్చలవిడిగా పెరిగి పోతున్నాయి.  చట్టాలు బలహీనంగా ఉన్నాయని అనుకోవాలా లేకపోతే రోజురోజుకీ మానవత్వ విలువలు మంట గలిసి మృగాళ్లు గా మారుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా ఇలాంటి ఘటనే తూర్పు గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో జరిగింది.

 

అన్న భార్య పై కన్నేసిన ప్రబుద్ధుడు దారుణానికి పాల్పడిన ఘటన తూర్పుగోదావరి జిల్లా పాలకొల్లు లో చోటుచేసుకుంది. పాలకొల్లు పట్టణంలోని వెదుళ్ళ పాలానికి చెందిన మడికి చిల్లాలు, కుటుంబరావు అన్నదమ్ములు. చిల్లాలు భార్య మరెమ్మ బతుకుదెరువు కోసం గల్ఫ్ కి వెళ్ళింది. చిల్లాలు తమ్ముడు కుటుంబరావు అతని భార్య కూడా గల్ఫ్ వెళ్లారు. అన్నదమ్ములిద్దరూ కలిసి ఉమ్మడిగా ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే ఇంటి నిర్మాణానికి ఖర్చులు చెరి సగం ఒప్పందం. ఇటీవలే అన్న భార్య గల్ఫ్ నుంచి తిరిగి రావడంతో ఇంటి నిర్మాణం విషయమై మాట్లాడుతుండగా ఘర్షణ చోటుచేసుకుంది.

 

దీంతో పెద్దల మధ్య పంచాయతీ పెడతానని భార్య అనడంతో ఆమె మరిది కుటుంబరావు ఆగ్రహించాడు. పెద్ద మనుషుల మధ్య పెడతావా అంటూ కత్తితో బెదిరించాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడంతో కుటుంబరావు కత్తితో దారుణంగామారెమ్మ ను చంపేశాడు. విచక్షణరహితంగా కత్తితో దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గల్ఫ్ నుంచి ఇండియాకు రాగానే కూతుళ్ళ వద్దకు వెళ్లి సాయంత్రం రావడం.. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోవడం జరిగిపోయాయని భర్త వినిపించాడు.

 

ఇదిలా ఉంటే తమ్ముడు కుటుంబరావు తరచూ మారెమ్మ ను లైంగికంగా వేధించేవాడని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. ఆ సంబంధానికి నిరాకరించిందన్న కోపంతోనే కుటుంబరావు కత్తితో దారుణంగా చంపేశాడని అనుమానిస్తున్నారు. అయితే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు

మరింత సమాచారం తెలుసుకోండి: