కావాల్సిన ప‌దార్థాలు:
టమాటాలు- ఒక కిలో
నూనె- పావు కిలో
కారం- 125 గ్రా
ఉప్పు- పావు కిలో

 

చింతపండు- 150 గ్రా
ఆవాలు- ఒక‌ టీ చెంచా
ఇంగువ- చిటికెడు
అల్లంవెల్లుల్లి పేస్ట్‌- పావుకిలో

 

జీలకర్ర పొడి- యాబై గ్రా
మెంతిపొడి- యాబై గ్రా
జీలకర్ర- రెండు టీ స్పూన్లు

 

త‌యారీ విధానం:
ముందుగా ట‌మాటాల‌ను నీళ్ల‌ల్లో క‌డిగి ఆర‌బెట్టుకుని చిన్న చిన్న ముఖ్కులుగా క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు గుజ్జులో టమాటా ముక్కలను నానబెట్టాలి. గంట తర్వాత గ్రైండ్‌ చేసి ఆ ముద్దలో ఉప్పు, కారం, జీలకర్ర మెంతి పొడులను వేసి కలపాలి. అలాగే స్టౌ మీద పాన్ పెట్టుకుని నూనె వేసి ఇంగువ, జీలకర్ర, ఆవాలు వేయించి తీయాలి. 

 

చల్లారిన తర్వాత ఇందులో అల్లంవెల్లుల్లి పేస్ట్‌ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని టమాటా ముద్దలో వేసి బాగా కలిపి ఓ గాజు డ‌బ్బాలో స్టోర్ చేసుకోవాలి. అంతే  ట‌మాట ఆవ‌కాయ రెడీ. వేడి వేడి అన్నంలోకి ఈ ఆవకాయ ఎంతో రుచిగా ఉంటుంది. ఇక‌ ఇది మూడు నెలల వరకూ నిల్వ ఉంటుంది. సో.. మీరు త‌ప్ప‌కుండా ట్రై చేయండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: