రొయ్యలు.. ఎంతోమందికి ఈ రొయ్యలు అంటే చాలా ఇష్టం. అయితే అందరూ ఈ రొయ్యలను అందరూ కూర చేసుకొని తింటారు మరికొందరు ఫ్రై చేసుకొని తిని ఉంటారు కానీ ఎప్పుడు పచ్చడి చేసుకొని ఉండరు.. కానీ రొయ్యల పచ్చడి ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ రొయ్యల పచ్చడి తింటే ఆహా ఏమి రుచి అని అంటారు. అయితే ఈ రొయ్యల పచ్చడి ఎలా చెయ్యాలో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావలసిన పదార్ధాలు.. 

 

రొయ్యలు - పావుకేజీ, 

 

ఉప్పు - తగినంత, 

 

పసుపు - ఒక టీస్పూన్‌, 

 

కారం - ఒక టేబుల్‌స్పూన్‌, 

 

నూనె - సరిపడా, 

 

అల్లం వెల్లుల్లి - 120 గ్రాములు, 

 

పచ్చిమిర్చి - ఇరవై, 

 

వెనిగర్‌ - అరకప్పు.

 

తయారీ విధానం... 

 

ముందుగా రొయ్యలను శుభ్రం చేసుకొని ఉప్పు, పసుపు పట్టించి అరగంటపాటు పక్కన పెట్టాలి. పాన్‌లో నూనె పోసి కాస్త వేడి అయ్యాక రొయ్యలు వేసి వేగించాలి.  కారం వేసి చిన్నమంటపై ఐదు నిమిషాల పాటు వేగించి పక్కన పెట్టుకోవాలి. మరొకపాన్‌లో నూనె వేసి అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వేగించాలి.పచ్చిమిర్చి కూడా వేసి మరికాసేపు వేగనివ్వాలి. తరువాత రొయ్యలు, వెనిగర్‌, కొన్ని నీళ్లు పోసి ఉడికించాలి. వెనిగర్‌ ఒకేసారి మొత్తం వేయకుండా ముందుగా పావు కప్పు వేయాలి. ఒకవేళ అవసరమనుకుంటే మరికాస్త వేయాలి. చిన్నమంటపై ఐదు నిమిషాల ఉడికించాలి.  రొయ్యల ఉడికిన తరువాత నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు స్టవ్‌ ఆర్పేసి, దించాలి. చల్లారిన తరువాత జాడీలో భద్రపరచుకోవాలి. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే నెలరోజుల పాటు పాడవకుండా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: