వెజ్ కిచిడి ఎంత రుచికరమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వెజ్ కిచిడితో ఆరోగ్యం సొంతం అవుతుంది. ఎన్నో పోషకాలు ఉండే ఈ వెజ్ కిచిడితో ఎన్నో ఆరోగ్యకరమైన లాభాలు ఉన్నాయి. అయితే ఈ కిచిడి ఎలా చేయాలో చాలామందికి తెలియదు.. అలాంటి వారంతా ఈ వెజ్ కిచడిని ఎలా చేయాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావాల్సిన పదార్థాలు.. 


 
బియ్యం- మూడున్నర కప్పులు, 

 

పెసరపప్పు- ఒకటిన్నర కప్పు, 

 

ఇంగువ- చిటికెడు, 

 

ఎండుమిర్చి- మూడు,

 

ఆవాలు- పావు టీస్పూను, 

 

కారం- అరటీస్పూను, 

 

పచ్చిమిర్చి- రెండు, 

 

కరివేపాకు- నాలుగు రెబ్బలు, 

 

పసుపు- పావు టీ స్పూను, 

 

ఉప్పు- తగినంత, 

 

వంకాయలు- మూడు, 

 

బంగాళాదుంప- ఒకటి, 

 

బీన్స్‌- పది, 

 

క్యారెట్లు- రెండు, 

 

నెయ్యి- 4 టేబుల్‌స్పూన్లు. 

 

తయారీ విధానం..  

 

పెసరపప్పు, బియ్యం కడిగి నానబెట్టాలి.. పాన్‌లో నెయ్యి వేసి బాగా వేడి అయ్యాక ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. ఆతరవాత కూరగాయల ముక్కలన్నీ వేసి వాటిలో వేయించాలి. అనంతరం అందులో సుమారుగా లీటరు నీళ్లు పోసి మరిగిన తరవాత నానబెట్టిన బియ్యం, పప్పు వేసి చిన్న మంట మీద ఉడికించి దించాలి. అంతే ఎన్నో పోషకాలు ఉన్న వెజ్ కిచిడీ రెడీ. 

మరింత సమాచారం తెలుసుకోండి: