చికెన్ రైస్.. టమోటా రైస్.. ఎగ్ రైస్.. ఆనియన్ రైస్.. పులిహోర.. లెమన్ రైస్.. పుదీనా రైస్.. ఇన్ని రైస్ లు ఉన్నప్పుడు నువ్వుల రైస్ ఉండొద్దా? అసలు ఎంత రుచికరంగా ఉంటుందో తెలుసా? ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో తెలుసా? ఆరోగ్యం.. రుచి.. అందం అన్ని ఈ నువ్వుల రైస్ లో ఉంటాయి. అయితే అలాంటి ఈ నువ్వుల రైస్ ని ఎలా చెయ్యాలో తెలుసా? తెలియకపోతే ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. రుచిని మీ సొంతం చేసుకోండి. 

 

కావాల్సిన పదార్ధాలు.. 

 

అన్నం - 2 కప్పులు, 

 

నువ్వులు - 4 స్పూనులు, 

 

నువ్వుల నూనె - 4 చెంచాలు, 

 

ఎండు మిర్చి - 5, 

 

శెనగపప్పు - 1టీస్పూను, 

 

ఇంగువ - చిటికెడు, 

 

ఉప్పు - తగినంత

 

తయారీ విధానం... 

 

స్టవ్ మీద పాన్ పెట్టి నువ్వులను వేయించి పక్కకు తీసి పెట్టాలి.. ఆ ఆతర్వాత అందులోనే నువ్వులు నూనె వేసి ఎండుమిర్చి ముక్కలు, ఇంగువ, శెనగపప్పు వేసి వేయించి అవి కూడా పక్కకు పెట్టాలి. అనంతరం.. వేయించిన నువ్వులు, ఎండుమిర్చి, ఇంగువ, శెనగపప్పు, కాస్త ఉప్పు కలిపి పొడిలా చెయ్యాలి. ఇంకా ఇప్పుడు నువ్వుల నూనె వేసి అది వేడి అయ్యాక నువ్వుల పొడి మిశ్రమం వేయాలి. వెంటనే వండిన అన్నాన్ని కూడా వేసి బాగా కలపాలి. అంతే నువ్వుల రైస్ రెడీ. ఈ నువ్వుల రైస్ ను వేడి వేడిగానే తినాలి. లేకుంటే రుచిగా ఉండదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: