కావాల్సిన ప‌దార్థాలు:
శనగపిండి- మూడు కప్పులు
తినే సోడా- చిటికెడు
యాలకుల పొడి- 1 టీస్పూను
చిక్కటి పాలు- రెండు కప్పులు

 

బిరియాని ఆకు- రెండు
కుంకుమ పువ్వు- చిటికెడు
చక్కెర- అర క‌ప్పు

 

రోజ్‌ వాటర్‌- అర టీస్పూను
జీడి ప‌ప్పు- కొద్దిగా
కిస్ మిస్- కొద్దిగా
పిస్తా పప్పు- 1 టే.స్పూను

 

తయారీ విధానం: ముందుగా శనగపిండిలో తినే సోడా వేసి, నీరు కలిపి జారుడు పిండిలా కలపాలి. ఇప్పుడు కడాయి పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక.. ఈ మిశ్రమాన్ని బూందీలా వేసుకుని.. వేగాక తీయాలి. ఇప్పుడు టీస్పూను పాలలో కుంకుమ పువ్వు వేసి కలిపి పక్కనుంచాలి. త‌ర్వాత స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టుకుని పాలలో బిరియాని ఆకులు వేసి పాలు సగమయ్యేవరకూ చిన్న మంట మీద 20 నిమిషాలపాటు కాగ‌నివ్వాలి. 

 

తర్వాత బిరియాని ఆకులు తీసేయాలి. ఇప్పుడు చక్కెర వేసి మీడియం ఫ్లేమ్‌ మీద ఒక నిమిషంపాటు కలపాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత బూంది, కుంకుమ పువ్వు, రోజ్‌ వాటర్‌, యాలకుల పొడి, జీడి ప‌ప్పు, కిస్ మిస్‌, పిస్తా ప‌ప్పు వేసి కలపాలి. ఇప్పుడు రెండు గంటలపాటు ఫ్రిజ్‌లో ఉంచి బ‌య‌ట‌కు తీస్తే స‌రిపోతుంది. అంతే బూందీ పాయసం రెడీ..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: