ఆలూ ఎగ్ మసాలా.. ఎంత రుచిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అలాంటి ఆలూ ఎగ్ మసాలాను ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. ఇది చపాతీలోకి బాగుంటుంది.. అన్నంలోకి బాగుంటుంది.. అలాంటి అద్భుతమైన ఆలూ ఎగ్ మసాలాను ఎలా చెయ్యాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

కావాల్సిన పదార్థాలు ... 

 

ఉడికించిన గుడ్లు - ఐదు, 

 

బంగాళాదుంప, 

 

ఉల్లిపాయ - పెద్దవి, 

 

పచ్చిమిర్చి - ఐదు, 

 

అల్లం, వెల్లుల్లి ముద్ద - ఒకటిన్నర చెంచా, 

 

ధనియాలపొడి - రెండు చెంచాలు, 

 

పసుపు - పావుచెంచా, 

 

సోంపు పొడి - అరచెంచా, 

 

గరం మసాలా - చిటికెడు, 

 

చిక్కని కొబ్బరిపాలు - రెండు కప్పులు, 

 

జీడిపప్పు ముద్ద - టేబుల్‌స్పూను, 

 

ఉప్పు - తగినంత, 

 

నూనె - పావుకప్పు.

 

తయారీ విధానం.. 

 

పాన్ పొయ్యిమీద పెట్టి నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలూ, తగినంత ఉప్పూ వేయాలి. అవి ఎర్రగా వేగాక నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. రెండు నిమిషాల తరవాత గరంమసాలా, ధనియాలపొడీ, పసుపూ, సోంపుపొడీ, జీడిపప్పు ముద్దా, ఉడికించిన బంగాళాదుంప ముక్కలూ, చిక్కని కొబ్బరిపాలూ వేసి కాసేపటి తర్వాత కొబ్బరిపాలు వేసి ఉడికించండి. అప్పుడు మంట తగ్గించి ఉడికించి పెట్టుకున్న గుడ్లను మధ్యకు కోసి అందులో వేయాలి. ఇది గ్రేవీలా తయారయ్యాక దింపేయాలి. అంతే ఆలూ ఎగ్ మసాలా రెడీ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: